లేటెస్ట్ లుక్స్ తో మెస్మరైజ్ చేస్తున్న శోభిత ధూళిపాల..!

Anilkumar
నటి శోభిత దూళిపాల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అయితే ఈమె ఆంధ్రప్రదేశ్ లోని తెనాలిలో ఒక తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి పెరిగింది. ఇక ఈమె పెరిగింది మొత్తం విశాఖపట్నంలోనే. అయితే శోభిత కి పదహారేళ్లు ఉండగానే ఒంటరిగా ముంబైకి వచ్చేసింది. కార్పొరేట్ లా చదువు కోసం ముంబై విశ్వవిద్యాలయంలో హెచ్ఆర్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ లో చేరింది. అయితే చదువు ఒకటే కాకుండా భరతనాట్యం కూచిపూడి లో సైతం శిక్షణ పొందింది. కాగా 2016లో ఆమె

 విక్కీ కౌశల్ సరసన రామన్ రాఘవ్ 2.0 తో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత జులై 2016లో ఫాంటం ఫిలిమ్స్ తో మూడు సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా ఈ సినిమాలో ఆమె పాత్ర కోసం ఆమె చాలా కష్టపడింది. ఆ తరువాత 2018 లో అడవి శేషు హీరోగా నటించిన గూడచారి సినిమాతో మొదటిగా తెలుగు తెరకు పరిచయం అయింది. దాని తరువాత 2022లో మళ్లీ అడవి శేషు తెలుగు బయోపిక్ సినిమా మేజర్ సినిమాలో సైతం ఒక కీలక పాత్రలో కనిపించింది. కాగా తెలుగులో ఈమె చేసిన రెండు

 సినిమాలు కూడా భారీ విజయాన్ని అందుకున్నాయి. మణిరత్నం తెరకెక్కించిన పీరియాడికల్ ఫిల్మ్ పొన్నియిన్ సెల్వన్: I. దాని సీక్వెల్ పొన్నియిన్ సెల్వన్: II, వానతిగా కనిపించింది. ఆ తర్వాత ఆమె ది నైట్ మేనేజర్ రెండు సీజన్లలో అనిల్ కపూర్, ఆదిత్య రాయ్ కపూర్‌లతో కలిసి నటించింది. ఈ వెబ్ సిరీస్ కి ఉత్తమ నటిగా ITA అవార్డును గెలుచుకుంది. ఇకపోతే ప్రస్తుతం ఏమే వరస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది కేవలం సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్  సైతం చేస్తూ బిజీగా ఉంది. ఇప్పటికే ఈమె చేసిన వెబ్ సిరీస్  మంచి హిట్ అందుకున్నాయి. దాంతో ప్రస్తుతం ఈమె సినిమాలతో పాటు వెబ్ సిరీస్ కూడా చేస్తోంది. తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలు కమిట్ అయ్యింది. అయితే తెలుగులో కంటే ఎక్కువగా బాలీవుడ్ లోనే సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తోంది ఈ బ్యూటీ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: