ప్రవీణ్‌తో బ్రేకప్‌పై స్పందించిన ఫైమా..!!

murali krishna
ఫైమా, పటాస్ ప్రవీణ్ జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే. జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్లుగా పనిచేస్తూ మంచి సక్సెస్ అందుకున్నారు.వీరిద్దరి మధ్య ప్రేమ కూడా చిగురించిందని ఇద్దరు ప్రేమలో ఉన్నారు అంటూ అనేక వార్తలు నెట్టింట హల్‌చల్ చేశాయి. బిగ్ బాస్ లో ఉన్నప్పుడు ఫైమా స్వయంగా ప్రవీణ్‌తో ప్రేమలో ఉన్న విషయం తెలిపింది. అయితే ఏమైందో ఏమోగాని కొన్నాళ్ల నుండి వీరిద్దరు కలిసి కనిపించడం లేదు. ఈ జంట కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. బయటకు వీళ్ళిద్దరు ప్రేమికలని ఎక్కువగా వినిపిస్తుండగా, వారిద్దరు పలు కారణాలతో విడిపోయారని కొందరు చెబుతున్నారు.కానీ ఫైమా బిగ్ బాస్ షోకు వెళ్లి వచ్చిన తర్వాత నుంచి ప్రవీణ్ తో వీడియోలు చేయకపవోడంతో పాటు కనిపించకుండా ఉండడంతో వీరిద్దరూ విడిపోయారని అంతా అనుకున్నారు. ఇదే విషయాన్ని చాలా మంది ఇంటర్వ్యూలు చేస్తూ అడగ్గా.. సరైన సమాధానం మాత్రం చెప్పలేదు. కానీ తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఈ ముద్దుగుమ్మ షాకింగ్ కామెంట్లు చేసింది. ప్రవీణ్ కు తాను ఎందుకు దూరం అయిందో వివరించింది. అలాగే తమ పెళ్లి ఆ దేవుడి చేతుల్లోనే ఉందంటూ చెప్పుకొచ్చింది. ఆ పూర్తి విషయాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.పటాస్ షో ద్వారా ఎంట్రీ ఇచ్చిన లేడీ కమెడియన్ ఫైమా గురించి అందరికీ తెలిసిందే. ముందుగా ఓ కాలేజీ స్నేహితులతో పటాస్ షోకు వచ్చిన ఈమె.. చాలా యాక్టివ్ గా ఉండడం చూసి ఆమెకు ఆషోలోనే ఓ ఛాన్స్ ఇచ్చారు. దాంతో ఆమె అందరినీ నవ్వించడం.. ఆమె వేసే పంచులు పేలడంతో ఆమెను రెగ్యులర్ కమెడియన్ గా మార్చారు. ముఖ్యంగా ఈమెకు ఓ పార్టనర్ ను ఇవ్వడం వారిద్దరికీ బాగా స్నేహం కుదరడంతో స్కిట్ లు మరింత చక్కగా చేశారు. ఇలా అద్భుతమైన స్కిట్ లు చేస్తూ అందరినీ నవ్వించారు.
కేవలం పటాస్, జబర్దస్త్ లలో మాత్రమే కాకుండా పైమా ఓ యూట్యూబ్ ఛానెల్ కూడా ప్రవీణ్ తో లవ్ ట్రాక్ నడిపింది. అదే కాకుండా సుమన్ టీవీ వాళ్లు చేసిన ఓ ఇంటర్వ్యూలో కూడా వీరిద్దరి ప్రేమ గురించి వివరించారు. ఇలా వీరిద్దరూ నిజమైనే ప్రేమికులే అని అంతా తెలుసుకున్నారు. ఇక ఫైమా తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా కూడా ప్రవీణ్ తో తన జర్నీ గురించి వివరించింది. ఈక్రమంలోనే ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ 6కు ఎంపికై అక్కడకు వెళ్లింది.అద్భుతమైన ఆట తీరుతో అందరి మనసు గెలుచుకున్న ఈమె చాలా రోజుల పాటు బిగ్ బాస్ షోలో కొనసాగింది. అయితే బయటకు వచ్చిన తర్వాతన నుంచి మాత్రం ప్రవీణ్ తో కలిసి కనిపించలేదు. అలాగే తన యూట్యూబ్ ఛానెల్ లో కూడా వీడియోలు పెట్టలేదు. ఇదే విషయం అందరూ అడగ్గా.. ప్రవీణ్ పై ప్రేమ లేదని.. ప్రజల్ని అబద్ధాలు చెప్పి మోసం చేయడం ఇష్టలేకే కలిసి కనిపింట్లేదంటూ అప్పట్లో చెప్పింది. కానీ కానీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె షాకింగ్ కామెంట్లు చేసింది. తాము నిజమైన ప్రేమికులు కాదని ముందు చెప్పినా... ఆ తర్వాత మాత్రం తమ మధ్య బంధం ఉందని చెప్పింది.అయితే దాని గురించి సమయం వచ్చినప్పుడు మాత్రమే చెబుతానని.. ఇప్పుడే ఏమీ మాట్లడలేనని వివరించింది. వీరిద్దరి మధ్య ఏదో పర్సనల్ గొడవ జరిగినట్లు ఈమె మాటలు వింటుంటే అర్థం అవుతుంది. ముఖ్యంగా ప్రేమించుకుంటున్నామంటూ కలిసి ఓ ఇంటర్వ్యూలో కూడా పాల్గొన్నారు కదా అని యాంకర్ అడగ్గా.. అవునని, మిగతా జంటలు కూడా అలా చేశాయి కదా అంటూ చెప్పుకొచ్చింది. వారి గురించి కాదు నువ్వు చెప్పంటూ అనగా.. మా మధ్య బంధం ఉందని వివరించింది. అయితే మరి పెళ్లెప్పుడని యాంకర్ ప్రశ్నించగా.. ఇప్పుడే చెప్పలేమని.. మా పెళ్లి ఆ దేవుడి చేతిలోనే ఉందంటూ క్లారిటీ ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: