నానికి వింత కష్టాలు... ఫుల్ క్రేజ్ ఉన్నా కూడా ఏమీ చేయలేకపోతున్నాడా..?

Pulgam Srinivas
నాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన సినీ పరిశ్రమలో పెద్దగా బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకొని ఎన్నో విజయాలను అందుకొని ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన స్థాయిలో ఉన్నాడు. కొన్ని రోజుల క్రితమే నాని "హాయ్ నాన్న" అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం నాని "సరిపోదా శనివారం" అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను డి వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై డి వి వి ధానయ్య నిర్మిస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే నాని , సుజిత్ దర్శకత్వంలో ఓ మూవీ ని ఓకే చేసుకున్నాడు. ఈ మూవీ ని కూడా డి వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై డి వి వి ధానయ్య నిర్మించబోతున్నట్లు ప్రకటన కూడా వచ్చింది. ఇక అంతా ఓకే సరిపోద్దా శనివారం సినిమా షూటింగ్ పూర్తి కాగానే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అవుతుంది అని అంతా అనుకున్నారు.

అంతలోనే సీన్ రివర్స్ అయ్యింది. నాని , సుజిత్ కాంబో మూవీ కి బడ్జెట్ భారీగా అయ్యే ఛాన్స్ ఉండడంతో ఆ మూవీ నుండి ప్రొడక్షన్ హౌస్ తప్పుకున్నట్లు తెలుస్తోంది. దానితో నాని ఇదే కథను వేరే నిర్మాణ సంస్థతో చేయాలి అని చూస్తున్నట్లు అందుకోసం ఓ నిర్మాణ సంస్థను వెతుకుతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే నాని కి ఉన్న క్రేజ్ కి నిర్మాణ సంస్థలు అతని దగ్గరికి పరిగెత్తుకుంటూ రావాలి. కానీ అలా జరగడం లేదు. ఇక సుధీర్ చెప్పిన కథ నాని కి అద్భుతంగా నచ్చడంతో కాస్త వెయిట్ చేసి అయినా సరే ఓ నిర్మాణ సంస్థను పట్టి ఈ మూవీ ని తెరకెక్కించాలి అని నాని గట్టి పట్టు మీద ఉన్నట్లు తెలుస్తోంది. మరి నాని , సుజిత్ కాంబో మూవీ ఎటు వైపు వెళుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: