కల్కికి వణుకుతున్న పాన్ ఇండియా మూవీస్..?

Purushottham Vinay
బాహుబలి స్టార్ పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్  సినిమాకు పోటీగా సినిమాను విడుదల చేయాలంటే ఇతర భాషల నిర్మాతలు, బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు కూడా టెన్షన్ పడతారు.ప్రభాస్ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ఏ రేంజ్ లో కలెక్షన్లు వస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి  సినిమా జూన్ నెల 27వ తేదీన థియేటర్లలో విడుదల కానుందనే సంగతి తెలిసిందే. ఈ మూవీ పై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. అయితే కల్కి సినిమాకు రెండు వారాల ముందు విడుదల చేసినా తమ సినిమాకు నష్టం తప్పదని ఇండియన్2  సినిమా మేకర్స్ భావిస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉన్నాయి.పైగా కల్కి 2898 ఏడీ సినిమాలో కమల్ హాసన్ కూడా కూడా నటిస్తుండటంతో రెండు వారాల గ్యాప్ లో కమల్ సినిమాలు విడుదలవుతూ ఉండటం వల్ల రెండు సినిమాలకు ఖచ్చితంగా నష్టమని ఇండియన్2 సినిమాకు మరింత నష్టమని ఆ మూవీ మేకర్స్ భావిస్తున్నారట. రెబల్ స్టార్ ప్రభాస్ దెబ్బకు ఇండియన్2 వెనుకడుగు వేసిందని ఇండియన్2 బయ్యర్లను ప్రభాస్ భయపెట్టారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉన్నాయి.అసలు ప్రభాస్ సినిమా రిలీజ్ అంటే ఇతర సినిమాల నిర్మాతలు కూడా చాలా భయపడుతున్నారు.


బ్లాక్ బస్టర్ టాక్ తో బాహుబలి2  బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళం, హిందీ భాషల్లో కూడా ప్రభాస్ సినిమాలు అంచనాలను మించి ఆకట్టుకున్నాయి. పైగా ప్రభాస్ సినిమాలకు 400 నుంచి 500 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరుగుతుండటం గమనార్హం.కల్కి మూవీ ప్రమోషన్స్ త్వరలో మొదలుకానుండగా ఈ సినిమా సాంగ్స్, ట్రైలర్ ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాలి. కల్కి మూవీ పాన్ వరల్డ్ రేంజ్ లో సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందని ప్రభాస్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. కల్కి సినిమా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్  భారీ మొత్తానికి అమ్ముడయ్యాయని సమాచారం. కల్కి సినిమాలోని ప్రతి పాత్రను దర్శకుడు నాగ్ అశ్విన్ స్పెషల్ గా తీర్చిదిద్దారని సమాచారం. పైగా ఎలక్షన్స్ తరువాత రిలీజ్ అవుతున్న ఫస్ట్ పాన్ ఇండియా సినిమా కావడంతో మిక్స్డ్ టాక్ వచ్చిన వసూళ్లు కుమ్మడం ఖాయం. ఇక ఇండియన్ 2 సినిమా జులై కి వాయిదా పడగా, ఆగస్టులో పుష్ప, సెప్టెంబర్ లో ఓజీ,దేవర, గేమ్ చేంజర్ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: