రజిని మూవీలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్..?

MADDIBOINA AJAY KUMAR
సూపర్ స్టార్ రజనీ కాంత్ ప్రస్తుతం టీజే జ్ఞానవేల్ దర్శకత్వం లో రూపొందుతున్న వెట్టయాన్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే . ఈ మూవీ లో రానా దగ్గు బాటి , ఫహద్ ఫాసిల్ , అమితాబ్ బచ్చన్ , మంజు వారియర్ తదితరులు కీలక పాత్రలు చేస్తుండ గా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నారు, . అదిరిపోయే యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లిమ్స్ వీడియోను మరికొన్ని రోజుల్లోనే విడుదల చేయడాని కి ఈ చిత్ర బృందం సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే తా జాగా ఈ మూవీ కి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . అదేంటంటే ఈ సినిమాలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ కూడా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది . అనిరుధ్ ఒక పాటలో రజనీవ్కాంత్ తో పాటు స్టెప్పులు వేయబోతున్నట్లు ప్రస్తుతం వార్తలు వస్తున్నాయి . ఇకపోతే జై భీమ్ మూవీ తర్వాత టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో వెట్టయాన్ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ప్రేక్షకులను స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

ఇకపోతే పోయిన సంవత్సరం జైలర్ మూవీ తో తమిళ ఇండస్ట్రీ హీట్ ను అందుకున్న రజినీ కాంత్ ప్రస్తుతం వెట్టయాన్ మూవీ తో పాటు కనకరాజు దర్శకత్వంలో రూపొందుతున్న కూలీ అనే మూవీ లో కూడా హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ కి కూడా అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తూ ఉండడం విశేషం. ఈ రెండు మూవీ లపై కూడా తమిళ ప్రేక్షకులు బారి అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: