అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న పుష్ప పార్ట్ 2 మూవీ పై ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ మొదటి భాగం ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన విజయాన్ని అందుకొని సంచలన కలక్షన్ లను వసూలు వసూలు చేసింది. అలాగే ఇందులో అల్లు అర్జున్ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడం , ఆ తర్వాత ఈ సినిమా లోని నటనకు గాను అల్లు అర్జున్ కు ఏకంగా నేషనల్ అవార్డు కూడా రావడంతో ఆ అంచనాలు తారా స్థాయికి చేరిపోయాయి.
ఇది ఇలా ఉంటే ఈ మూవీ యొక్క మొదటి పార్ట్ ను తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేశారు. ఈ మూవీ రెండవ భాగాన్ని కూడా ఈ ఐదు భాషల్లోనే విడుదల చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ తాజాగా అదనంగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాను మరొక భాషలో కూడా విడుదల చేయబోతున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా తాజాగా విడుదల చేశారు. ఈ మూవీ ని అదనంగా బెంగాలీ భాషలో కూడా విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం వారు తాజాగా అధికారికంగా ప్రకటించారు.
ఇలా ఈ సినిమా ఇండియా లోనే ఆరు భాషల్లో విడుదల కానుంది. మరి ఈ సినిమాకు బెంగాలీ ప్రేక్షకుల నుండి ఏ స్థాయి రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి. ఇకపోతే ఈ మూవీ లో రష్మిక మందన , అల్లు అర్జున్ కి జోడి గా కనిపించనుండగా ... గ్రేట్ డైరెక్టర్ సుకుమార్ ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీత సారధ్యంలో రూపొందుతున్న ఈ మూవీ ని మైత్రి సంస్థ వారు నిర్మిస్తూ ఉండగా ... ఫాహద్ ఫాజీల్ ఈ మూవీ లో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు.