"కూలీ" మేకర్స్ కి షాక్ ఇచ్చిన ఇళయరాజా..!

MADDIBOINA AJAY KUMAR
పోయిన సంవత్సరం విడుదల అయిన జైలర్ మూవీ తో తమిళ ఇండస్ట్రీ హిట్ ను అందుకున్న సూపర్ స్టార్ రజినీ కాంత్ ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ప్రస్తుతం రజనీ కాంత్ నటిస్తున్న మూవీలలో కూలీ మూవీ ఒకటి. ఈ సినిమాకి కోలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ డైరెక్టర్ లలో ఒకరు అయినటువంటి లోకేష్ కనకరాజు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ కి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.

ఈ సినిమాలో శృతి హాసన్ ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ బృందం ఈ సినిమా యొక్క టైటిల్ ను ప్రకటిస్తూ ఓ వీడియోను విడుదల చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇక ఈ వీడియోకు అనిరుద్ రవిచంద్రన్ ఓ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను ఇచ్చాడు. అది మొదట ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోకపోయినప్పటికీ వినగా వినగా దానికి జనాల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. ఇకపోతే తాజాగా ఈ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయం లోనే మేకర్స్ కి పెద్ద షాక్ తగిలింది. ఈ టీజర్ చూసాక తలైవర్ ఫ్యాన్స్ కి తన వింటేజ్ చిత్రం 1983 లో వచ్చిన తంగ మగన్ లోని వా వా పక్కం వా  సాంగ్ లో ట్యూన్ వెంటనే స్ట్రైక్ అయ్యింది.

దీనితో ఇదే ఇప్పుడు కూలీ మేకర్స్ కి షాకిచ్చింది. తంగ మగన్ లో ఒరిజినల్ ట్యూన్ ని స్వరపరిచిన సంగీత దర్శకులు లెజెండరీ ఇళయరాజా ఇపుడు కూలీ మేకర్స్ పై కేసు వేసినట్టుగా తెలుస్తుంది. తాను కంపోజ్ చేసిన ట్యూన్ ని తన అనుమతి లేకుండా ఎలా వాడుకుంటారు అని ఆయన కేసులోని సారాంశం అట. ఇక గతంలో కూడా అనిరుద్ తాను సంగీతం అందించిన కొన్ని సినిమాలకు ఇళయరాజా చేసిన ట్యూన్స్ ను కాపీ చేసినట్లు కామెంట్స్ వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: