నాగార్జున తనకు పెట్టిన ముద్దు పేరు బయటపెట్టిన టబు..!!!

murali krishna
నాగార్జున, టబు ఇద్దరు మంచి స్నేహితులు. లవర్స్ అని అంతా మాట్లాడుకుంటారు. కానీ టబుకి ఓ ముద్దు పేరు పెట్టాడట నాగ్‌. ఆ విషయాన్ని టబు అందరి ముందు చెప్పడం విశేషం.టబు.. ఈ పొడుగు కాళ్ల సుందరి టాలీవుడ్‌లో నటించింది తక్కువ సినిమాలే అయినా ఓ ఊపు ఊపేసింది. గ్లామర్‌ డాల్‌గా చాలా మంది కుర్ర హృదయాలకు కొల్లగొట్టింది. అభిమానులుగా మార్చేసుకుంది. ఆ తర్వాత టాలీవుడ్‌కి దూరమైనా ఇప్పటికీ ఆమెని ఆరాధించే అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అంతగా తనదైన నటన, అందంతో కట్టిపడేసిందీ బ్యూటీ.హిందీలో ఎక్కువగా రాణించిన టబు.. తెలుగు అమ్మాయే కావడం విశేషం. హైదరాబాద్‌కి చెందిన టబు.. మొదట బాలీవుడ్‌లో రాణించింది. అక్కడ రెండు సినిమాలు చేసి ఆ తర్వాత కూలీ నెం.1 చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. వెంకటేష్‌తో కలిసి నటించి అదరగొట్టింది. తొలి చిత్రంతోనే హిట్‌ అందుకుంది. ఆ తర్వాత నాగార్జున నిర్మించిన సిసింద్రీ చిత్రంలో గెస్ట్ రోల్‌ చేసింది. ఇందులో అఖిల్‌ బాలనటుడిగా మెరిసిన విషయం తెలిసిందే.
ఆ సమయంలోనే తెలుగు ఆడియెన్స్ కి మరింత దగ్గరయ్యింది. తెలుగు మేకర్స్ దృష్టిలో పడింది. కృష్ణవంశీ ఆమెని నిన్నే పెళ్లాడతా చిత్రం కోసం ఎంపిక చేశాడు. ఈ రొమాంటిక్‌ ఫ్యామిలీ డ్రామా ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. నాగార్జున రొమాన్స్ కి టబు అందం తోడు కావడంతో దుమ్మురేపారు. ఇద్దరు కలిసి వెండితెరపై రచ్చ చేశారు. ఇద్దరి రొమాన్స్ తెలుగు ఆడియెన్స్ ని ఊపేసింది. అలా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. అదే సమయంలో ఇద్దరి మధ్య రిలేషన్‌ కూడా బిల్డ్ అయ్యిందనే వార్తలు వచ్చాయి.నెక్ట్స్ సినిమా కూడా నాగ్‌తోనే చేసింది టబ్. ఆవిడే మా ఆవిడ చిత్రంలో నటించి మరోసారి మెప్పించింది. దీంతో డేటింగ్‌ రూమర్స్ మరింతగా పెరిగాయి. నాగార్జున ప్రేమలో పడే టబు పెళ్లి చేసుకోలేదనే పుకార్లు వినిపించాయి. ఇప్పటికీ అదే వినిపిస్తుంది. అంతేకాదు హైదరాబాద్‌కి టబు వస్తే నాగార్జున ఇంటికే వెళ్తుందట. అంతటితో ఆగలేదు, నాగ్‌ ఇంటికి ఎదురుగానే తాను ఇళ్లు కొనుక్కుందట. ఇన్ని రకాల హింట్స్ ఉండటంతో ఎవరైనా రూమర్స్ విస్తరిస్తారని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
అయితే దీనిపై ఇటీవల నాగార్జున స్పందించారు. తామ మధ్య ఫ్రెండ్‌షిప్‌ కి మించిన బంధం అని, ఆమె తన ఫ్యామిలీలో మెంబర్‌ అని, అమలతోనూ చాలా క్లోజ్‌గా ఉంటుందని తెలిపారు నాగ్‌. టబుకి ఏదైనా సమస్య వస్తే తనకే మొదటి ఫోన్‌ వస్తుందని తెలిపారు. తమది ఓ రకంగా ఫ్యామిలీ రిలేషన్‌ అని చెప్పారు నాగ్‌. అదే సమయంలో తను చాలా సెన్సిటివ్‌ అని, అందుకే పెళ్లి చేసుకోలేదని తెలిపారు.ఇదిలా ఉంటే టబుకి నాగార్జున ఓ ముద్దు పేరు కూడా పెట్టాడట. ఆ విషయాన్ని టబు బయటపెట్టింది. పెద్ద ఈవెంట్‌లో ఇండస్ట్రీ మొత్తం ఉన్న ఈవెంట్‌లో బహిర్గతం చేయడం విశేషం. ఆ మధ్య కొన్నేళ్ల క్రితం తెలుగు చిత్ర పరిశ్రమ వజ్రోత్సవ వేడుకలు జరిగిన విషయం తెలిసిందే. ఇందులో టబు పాల్గొన్నారు. తెలుగు ఇండస్ట్రీ గురించి, తన కెరీర్‌లో బెస్ట్ మూమెంట్స్ గురించి ఆమె మాట్లాడింది.తొలి సినిమా ఆఫర్‌ ఇచ్చిన రాఘవేంద్రరావు, రామానాయుడికి ఆమె థ్యాంక్స్ చెప్పింది. కూలీ నెంబర్‌ 1`తో తన కెరీర్‌ ప్రారంభమైందని తెలిపింది. ఈ సందర్భంగానే `పండు అనే పేరుని ఇచ్చినందుకు నాగార్జునకి థ్యాంక్స్ అని తెలిపింది టబు. అంటే టబుకి పండు అనే ముద్దు పేరు పెట్టాడని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీంతో టబు మాటలకు ఈవెంట్‌ మొత్తం అరుపులతో గోల చేయడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: