"పుష్ప" నుండి మరో పోస్టర్..!

Pulgam Srinivas
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొంత కాలం క్రితం పుష్ప పార్ట్ 1 మూవీ లో హీరో గా నటించిన అద్భుతమైన విజయాన్ని సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇక ఈ సినిమా విడుదల అయిన తర్వాత ఇందులోనీ నటనకు గాను అల్లు అర్జున్ కు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. ఇక ఆ తరువాత ఈయనకు ఈ సినిమాలోని నటనకు గాను నేషనల్ అవార్డు కూడా దక్కింది. ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటించగా ... సుకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. మైత్రి సంస్థ వారు నిర్మించిన ఈ మూవీ కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా ... సమంత ఇందులో ఓ ఐటమ్ సాంగ్ లో నటించింది. అనసూయ , సునీల్ , రావు రమేష్ ముఖ్య పాత్రలలో నటించిన ఈ మూవీ లో ఫహద్ ఫాజిల్ ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు.
 

ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ కి కొనసాగింపుగా పుష్ప పార్ట్ 2 మూవీ రూపొందుతుంది. ఈ సినిమాను ఆగస్టు 15 వ తేదీన విడుదల చేనున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు విడుదల చేయనున్నారు. ఈ మూవీ లోని మొదటి సాంగ్ అయినటువంటి "పుష్ప పుష్ప" అంటూ సాగే పాటను ఈ రోజు సాయంత్రం 5 గంటల 04 నిమిషాలకు విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని ఈ మూవీ బృందం వారు ఇప్పటికే ప్రకటించింది. ఇకపోతే తాజాగా ఈ విషయాన్ని మరోసారి ధృవీకరిస్తూ ఈ మూవీ బృందం అల్లు అర్జున్ కు సంబంధించిన ఓ పోస్టర్ ను విడుదల చేసింది. ఇందులో అల్లు అర్జున్ ఇన్షర్ట్ వేసుకొని స్టైలిష్ లుక్ లో ఉన్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

aa

సంబంధిత వార్తలు: