"ఆర్సి16" సీన్ లోకి బాలీవుడ్ నటుడు..?

Pulgam Srinivas
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా జాన్వి కపూర్ హీరోయిన్ గా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో మరికొన్ని రోజుల్లో ఓ మూవీ స్టార్ట్ కాబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో కన్నడ సినీ పరిశ్రమలో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి శివరాజ్ కుమార్ ఓ కీలకమైన పాత్రలో కనిపించనుండగా ... ఏఆర్ రెహమాన్ ఈ మూవీ కి సంగీతం అందించబోతున్నాడు. ఈ మూవీ పూజా కార్యక్రమాలతో కొన్ని రోజుల క్రితమే ప్రారంభం అయ్యింది. ఈ సినిమాకు ఇప్పటి వరకు చిత్ర బృందం టైటిల్ ను ఫిక్స్ చేయలేదు.

దానితో ఈ సినిమా చరణ్ కెరియర్ లో 16 వ మూవీగా రూపొందుతున్న నేపథ్యంలో "ఆర్ సి 16" అనే వర్కింగ్ టైటిల్ తోనే ఈ మూవీ ని చిత్ర బృందం లాంచింగ్ చేసింది. ఇక ప్రస్తుతం చరణ్ "గేమ్ చేంజర్" అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ మరికొన్ని రోజుల్లోనే కంప్లీట్ కానుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే "ఆర్ సి 16" మూవీ ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాలో హేమా హేమీలు అయినా నటీ నటులు కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ మూవీ లో ఓ క్రేజీ బాలీవుడ్ నటుడు కూడా నటించబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... తాజాగా యానిమల్ మూవీ లో విలన్ పాత్రలో నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించిన బాబి డియోల్ ను "ఆర్ సి 16" లో తీసుకోవాలని మేకర్స్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ఈయన విలన్ పాత్రలో కాకుండా చరణ్ కు మెంటర్ పాత్రలో కనిపించబోతున్నట్లు ఈయన పాత్ర సూపర్ గా ఉండబోతున్నట్లు వార్త వైరల్ అవుతుంది. ఇక బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందబోయే సినిమా తర్వాత చరణ్ , సుకుమార్ దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: