కాబోయే భర్తపై ట్రోలింగ్.. స్పందించిన వరలక్ష్మి శరత్ కుమార్?

praveen
సాధారణంగా సినీ సెలబ్రిటీలకు సోషల్ మీడియాలో కాస్త ఎక్కువగా క్రేజ్ ఉంటుంది. ఈ క్రమంలోనే ఇలా సెలబ్రిటీలకు సంబంధించి ఏ విషయం తెరమీదికి వచ్చిన కూడా అది తెగ హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అని చెప్పాలి. సాధారణంగా అయితే సిని సెలబ్రిటీల ప్రొఫెషనల్ లైఫ్ గురించి అన్ని విషయాలు అభిమానులకు తెలిసే ఉంటాయి. అందుకే పర్సనల్ లైఫ్ కి సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకునేందుకు ఆసక్తిని కనబరిస్తూ ఉంటారు అభిమానులు. ఇక ప్రేమ పెళ్లి వ్యవహారం ఏదైనా వెలుగులోకి వచ్చింది అంటే చాలు అది ఇంటర్నెట్లో వైరల్ గా మారిపోతూ ఉంటుంది.

 ఈ క్రమంలోనే పెళ్లి అనే వార్తలతో గత కొంతకాలం నుంచి వరలక్ష్మి శరత్ కుమార్ వార్తల్లో తెగ హాట్ టాపిక్ గా మారిపోతుంది. శరత్ కుమార్ వారసురాలిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన వరలక్ష్మి మొదట్లో హీరోయిన్గా నటించింది. ఆ తర్వాత హీరోయిన్ పాత్రలకు మాత్రమే పరిమిత కాకుండా వైవిధ్యమైన పాత్రలు చేసుకుంటూ తనలోని నటిని నిరూపించుకుంది. ఏకంగా పెద్దపెద్ద హీరోల నుండి ఢీకొట్టే విలన్ పాత్రల్లో సైతం నటించి ఆకట్టుకుంది.

 ఇలా నటిగా భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీలో మంచి గుర్తింపుని సంపాదించుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ తన స్నేహితుడు అయిన నికోలై సచ్ దేవుని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైంది. అయితే ఇటీవల ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. దీంతో అతని గురించి ఎన్నో వార్తలు వైరల్ గా మారిపోయాయి. సెకండ్ హ్యాండ్ వ్యక్తిని వరలక్ష్మి పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఇక అతనిపై ఎంతో ట్రోలింగ్ కూడా జరిగింది. అయితే ఇలా తన పెళ్లి విషయంలో వస్తున్న ట్రోలింగ్ పై హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ స్పందించింది. నేను నికోలై సచ్ దేవుని డబ్బు కోసం పెళ్లి చేసుకోవడం లేదు. నా సంపాదనతో నేను చాలా సంతోషంగా ఉన్నాను  అలాంటప్పుడు నేను డబ్బు కోసం ఎందుకు పెళ్లి చేసుకుంటా. నికోలై తన మొదటి భార్యతో కలిసి ఉన్నప్పటి నుంచి ఆయనతో పరిచయం ఉంది. ఆయన ప్రవర్తన మర్యాద చూసి నాకు ప్రేమ కలిగింది  నా కళ్ళకు ఆయన ఎప్పటికీ హీరోనే అంటూ వరలక్ష్మి శరత్ కుమార్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: