నాకు ఇండస్ట్రీలో సరైన గుర్తింపు రాలేదు.. ఇలియానా కామెంట్స్ వైరల్?

praveen
టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు ఇలియానా గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. దేవదాస్ అనే సినిమాతో హీరోయిన్గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. అతి తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. సన్నజాజిలాంటి తన నడుముంపు అందాలతో తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఫిదా చేసేసింది. తన కొంటె చూపులతో ఎంతోమంది మనసులను కొల్లగొట్టింది ఈ ముద్దుగుమ్మ . తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు దక్కించుకొని ఎన్నో సూపర్ హిట్లను ఖాతాలో వేసుకుంది.

 ఇండస్ట్రీలో దాదాపు దశాబ్ద కాలం పాటు స్టార్ హీరోయిన్గా హవా నడిపించింది. కానీ ఆ తర్వాత కాలంలో మాత్రం ఈ అమ్మడికి ఒక్కసారిగా అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో బాలీవుడ్ లో పాగా వేయాలని అనుకుంది. అక్కడ  అవకాశాలు తలుపు తట్టాయి. కానీ ఎందుకో అక్కడ అదృష్టం కలిసి రాలేదు. దీంతో అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాతో తెలుగులోకి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చిన ప్రేక్షకుల నుంచి మాత్రం ఆదరణ కరువైంది. ఎందుకంటే సన్నజాజిలా ఉన్న ఈ ముద్దుగుమ్మ.. బొండు మల్లెల మారింది. దీంతో బొద్దుగా మారిన ఇలియానాను ఆదరించలేకపోయారు తెలుగు ప్రేక్షకులు.

 ఇక తర్వాత లవ్ బ్రేకప్ తో డిప్రెషన్ లోకి వెళ్లిపోవడం.. పెళ్లి కాకుండానే బిడ్డకు జన్మనివ్వడం ఇలా తరచూ వార్తల్లోనే నిలుస్తూ వస్తుంది వచ్చింది ఇలియానా. ఇటీవలే తన కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇండస్ట్రీలో తనకు రావలసిన గుర్తింపు రాలేదని.. అందుకు కారణం కూడా తెలియదు అంటూ హీరోయిన్ ఇలియానా అన్నారు. బర్ఫీ సినిమాలో నటించాక సౌత్ ఇండస్ట్రీ నుంచి నాకు ఆఫర్లు రాలేదు. అక్కడ నిర్మాతలు దర్శకులు నేను బాలీవుడ్ లో సెటిల్ అయ్యాను అని అనుకున్నారు. మంచి కథ దొరికితే నేను ఎక్కడైనా నటించడానికి సిద్ధంగానే ఉన్నా. కానీ నాకు అవకాశాలు ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాలేదు అంటూ ఇలియానా చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: