"ప్రసన్న వదనం" సెన్సార్ కార్యక్రమాలు పూర్తి..!

Pulgam Srinivas
టాలీవుడ్ యువ నటుడు సుహాస్ తాజాగా ప్రసన్న వదనం అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. అర్జున్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ మే 3 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల కానుంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం అనేక ప్రచార చిత్రాలను విడుదల చేసింది. ఇకపోతే ఈ సినిమా బృందం వారు ఇప్పటి వరకు తెలుగు సినీ పరిశ్రమలో ప్రసన్న వదనం సినిమా రూపొందిన కాన్సెప్ట్ తో ఏ సినిమా రాలేదు అని , ఈ సినిమా లోని ప్రతి సన్నివేశం హైలైట్ గా ఉంటుంది అని , ఆఖరికి వచ్చే సరికి కొన్ని ట్విస్టులు రెవిల్ అవుతాయి.
 

ఆ ట్విస్ట్ లను మీరు ఎవరు ఊహించలేరు అని చెప్పుకుంటూ వస్తున్నారు. దానితో ఈ మూవీ ఏ స్థాయిలో ఉంటుందా అని ప్రేక్షకులు ఈ మూవీ పై మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మే 3 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేశారు. ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి యు / ఏ సర్టిఫికెట్ లభించింది. ఈ విషయాన్ని ఈ చిత్ర బృందం వారు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు.

ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది. ఇకపోతే ఇప్పటికే రైటర్ పద్మభూషణ్  అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్ లాంటి రెండు వరస విజాయల తర్వాత సుహాస్ నటించిన మూవీ కావడంతో ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకులు మంచి మంచనలు పెట్టుకున్నారు. మరి ఈ మూవీ తో ఈయన హైట్రిక్ విజయాలను అందుకుంటాడేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: