అఫీషియల్ : "పుష్ప 2" ఫస్ట్ సింగల్ అప్డేట్ వచ్చేసింది..!

MADDIBOINA AJAY KUMAR
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొంత కాలం క్రితం "పుష్ప పార్ట్ 1" మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో అందాల ముద్దుగుమ్మ రష్మిక మందన హీరోయిన్ గా నటించగా, టాలీవుడ్ టాప్ డైరెక్టర్ లలో ఒకరు అయినటువంటి సుకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అనసూయ, సునీల్, రావు రమేష్ ఈ మూవీ లో ముఖ్యమైన పాత్రలలో నటించగా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందించాడు.
 

మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని సమంత ఈ సినిమాలో ఓ ఐటెం సాంగ్ లో నటించగా ... మైత్రి సంస్థ బ్యానర్ వారు ఈ మూవీ ని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించారు. భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా మూవీ గా విడుదల అయిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ మూవీ లోని నటనకు గాను అల్లు అర్జున్ కు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి ప్రశంసలు రావడం మాత్రమే కాకుండా నేషనల్ అవార్డు కూడా దక్కింది. ఇక ప్రస్తుతం ఈ మూవీ కి కొనసాగింపుగా "పుష్ప పార్ట్ 2" అనే సినిమా చిత్రీకరణ జరుగుతుంది.

ఈ సినిమాను ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ సినిమా ఫస్ట్ సింగిల్ కు సంబంధించిన అప్డేట్ ను తాజాగా ఈ మూవీ యూనిట్ విడుదల చేసింది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ ప్రోమోను రేపు సాయంత్రం 4 గంటల 05 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది.

ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. ఈ మూవీ ఆల్బమ్ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా పాటలు ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటాయో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

Aa

సంబంధిత వార్తలు: