ప్రసన్న వదనం తెలంగాణ తమిళనాడు హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..!

MADDIBOINA AJAY KUMAR
తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటువంటి సుహాస్ తాజాగా "ప్రసన్న వదనం" అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. అర్జున్ వై కే దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను మణికంఠ , ప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ మూవీ ని మే 3 వ తేదీన థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ ఓవర్సీస్ హక్కులను ఈ చిత్ర బృందం ఇప్పటికే అమ్మివేసింది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ సినిమా యొక్క ఓవర్సీస్ హక్కులను ది విలేజ్ గ్రూప్ సంస్థ దక్కించుకుంది.
 

అందులో భాగంగా యూ ఎస్ ఏ లో మే 2 వ తేదీనే ఈ మూవీ ప్రీమియర్స్ ప్రదర్శించనున్నట్లు ఈ సంస్థ వారు ప్రకటించారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన మరో క్రేజీ అప్డేట్ ను కూడా ప్రకటించింది. ఈ సినిమా యొక్క తెలంగాణ మరియు తమిళ నాడు థియేటర్ హక్కులను మైత్రి డిస్ట్రిబ్యూషన్ సంస్థ దక్కించుకున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా యొక్క తెలంగాణ మరియు తమిళ నాడు థియేటర్ హక్కులను దక్కించుకున్న మైత్రి డిస్ట్రిబ్యూషన్ సంస్థ వారు ఈ రెండు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేయడానికి ఇప్పటికే సన్నాహాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే రైటర్ పద్మభూషణ్ , అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీ లతో మంచి సక్సెస్ లో ఉన్న సుహస్ నటించిన మూవీ కావడంతో ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ మూవీ తో సూహస్ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో... ప్రేక్షకులను ఏ రేంజ్ లో అలరిస్తాడో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: