దేవర: బిజినెస్ విషయంలో గుడ్ డెసిషన్?

Purushottham Vinay
టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్  కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న దేవర మూవీ థియేటర్లలో రిలీజ్ కావడానికి ఏకంగా ఐదున్నర నెలల సమయం ఉంది.ఇప్పటికే దేవర నాన్ థియేట్రికల్ హక్కులు, ఓవర్సీస్ హక్కులు అమ్ముడవగా ఈ సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులు 120 కోట్ల రూపాయలకు పైగా విక్రయించనున్నారని సమాచారం తెలుస్తోంది. ఇతర పాన్ ఇండియా సినిమాల రైట్స్ తో పోలిస్తే ఈ మొత్తం కొంచెం తక్కువేనని చెప్పవచ్చు. అయితే కొరటాల శివ గత సినిమా ఆచార్య చాలా తీవ్రంగా నిరాశపరిచిన నేపథ్యంలో మరీ ఇంత భారీ మొత్తానికి హక్కులను అమ్మడం సరికాదని దేవర నిర్మాతలు భావిస్తున్నట్టు సమాచారం తెలుస్తోంది.తమ సినిమా హక్కులను మరీ ఇంత భారీ మొత్తానికి విక్రయించి డిస్ట్రిబ్యూటర్లు నష్టపోవడం సరి కాదని దేవర మేకర్స్ ఫీలయ్యారని సమాచారం తెలుస్తుంది. 120 కోట్ల రూపాయలు అంటే ప్రస్తుతం ఎన్టీఆర్ క్రేజ్ కు అంత ఎక్కువ మొత్తం కాదు. ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల రూపాయల రేంజ్ లో దేవర థియేట్రికల్ రైట్స్ అమ్ముడయ్యే అవకాశం ఉంది.


దేవర నైజాం హక్కులు మైత్రీ నిర్మాతలు సొంతం చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని సమాచారం తెలుస్తోంది.మైత్రీ నిర్మాతలు కొరటాల శివకు అత్యంత సన్నిహితులు అనే సంగతి అందరికి తెలిసిందే. దేవర సినిమా బిజినెస్ విషయంలో ఈ సినిమా నిర్మాతలు చాలా సంతోషంగానే ఉన్నారని సమాచారం అందుతోంది. దసరా పండుగ కానుకగా ఈ మూవీ విడుదల కానుండగా ఈ సినిమాకు పోటీగా రిలీజయ్యే సినిమాల గురించి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఆంధ్ర హక్కులని సితార ఎంటర్టైన్మెంట్స్ కొనుగోలు చేస్తున్నట్లుగా రూమర్స్ వస్తున్నాయి కానీ అందులో నిజమెంత ఉందో తెలీదు.జూనియర్ ఎన్టీఆర్  సోలో హీరోగా ఈ సినిమాతో సక్సెస్ సాధించడం కీలకం కాగా ఈ సినిమా ఫలితం ఆధారంగా జాన్వీ కపూర్ కెరీర్ కూడా డిసైడ్ అవుతుందని నెటిజన్ల నుంచి కామెంట్స్ వినిపిస్తున్నాయి. కొరటాల శివ ఈ సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకుంటానని చాలా కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. మరి చూడాలి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని నమోదు చేస్తుందో..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: