పాతాలానికి ఫ్యామిలీ స్టార్.. ఆకాశానికి టిల్లు స్క్వేర్?

Purushottham Vinay
విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్( బుజ్జి)  దర్శకత్వంలో 'గీత గోవిందం' లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత రూపొందిన చిత్రం 'ది ఫ్యామిలీ స్టార్'.బాలీవుడ్ హాట్ బ్యూటీ మృణాల్ ఠాకూర్  హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు  నిర్మాత. ఈ సినిమా టీజర్ ట్రైలర్స్ ప్రేక్షకులను అలరించాయి. దీంతో మొదటి నుండి సినిమా పై మంచి బజ్ ఏర్పడింది. కానీ ఏప్రిల్ 5 న రిలీజ్ అయిన ఈ మూవీకి అట్టర్ ప్లాప్ టాక్ వచ్చింది.దీంతో ఈ మూవీకి దారుణమైన ఓపెనింగ్స్ మాత్రమే నమోదయ్యాయి.ఈ మూవీ ఫస్ట్ వీకెండ్ వసూళ్ల విషయానికి వస్తే.. ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాకి రూ.44 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.45 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యేసరికి ఈ సినిమా కేవలం అత్యంత దారుణాతి దారుణంగా రూ.10 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. కేవలం 19 కోట్ల గ్రాస్ మాత్రమే రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా రూ.34 కోట్ల షేర్ ను ఈ సినిమా రాబట్టాల్సి ఉంది. కానీ అది మాత్రం అస్సలు జరిగేలా లేదు.


ఈ సినిమా పెళవ కంటెంట్ కారణంగా తారా స్థాయిలో నెగటివిటీని సోషల్ మీడియాలో ఎదురుకుంటుంది.ఈరోజు కనీసం 20 లక్షలు కూడా వసూలు చేయలేకపోయిందంటే ఈ సినిమా పరిస్థితి ఏంటో పూర్తిగా అర్థం చేసుకోవచ్చు. విజయ్ దేవరకొండ, దిల్ రాజు చేసిన ఓవర్ హైప్ వల్ల ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ చాలా మంది ప్రేక్షకులని ఆకట్టుకోవడంలో  ఈ సినిమా దారుణంగా విఫలమైంది.ఇదిలా ఉంటే సిద్ధు జొన్నలగడ్డ నటించిన టిల్లు స్క్వేర్  రెండవ వారంలో కూడా బాక్సాఫీస్ వద్ద అనూహ్యంగా మంచి ప్రదర్శన కనబరుస్తుంది. 100 కోట్ల రూపాయల గ్రాస్ మార్క్ తో ప్రేక్షకులని థియేటర్లకు రప్పిస్తూనే ఉంది. టికెట్ల అమ్మకాల విషయంలో టిల్లు స్క్వేర్ ది ఫ్యామిలీ స్టార్ ని డామినేట్ చేస్తోంది. టిల్లు స్క్వేర్ బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ హోల్డ్ తో దూసుకు పోతుంది. ఇప్పటికే 25 కోట్ల వరకు లాభాలు తెచ్చిపెట్టింది ఈ సినిమా.నేడు ఈ సినిమా సక్సెస్ మీట్ కి జూనియర్ ఎన్టీఆర్ అతిధిగా రాబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: