"హ్యాపీ డేస్" రీ రిలీస్ ఆ తేదీనే..!

Pulgam Srinivas
టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కొన్ని సంవత్సరాల క్రితం హ్యాపీ డేస్ అనే సినిమాను తెరకెక్కించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా ఆ సమయం లో అద్భుతమైన విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా అప్పటి ప్రేక్షకు లను ఈ సినిమా ఎంత గానో అలరించింది . ఇకపోతే ఈ సినిమా లో నటించిన నటీనటులందరికీ కూడా ఈ మూవీ ద్వారా ఎంతో గొప్ప గుర్తింపు లభించింది. ఇది ఇలా ఉంటే హ్యాపీ డేస్ సినిమా లో హీరోయిన్ గా నటించిన తమన్నా ఈ మూవీ తర్వాత తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్ స్నానా నికి వెళ్లడం మాత్రమే కాకుండా ఇండియాలో ఉన్న దాదాపు అన్ని భాషల సినిమాల్లో నటించి ఇప్పటికీ కూడా అద్భుతమైన క్రేజ్ ఉన్న నటిగా కెరియర్ ను కొనసాగిస్తుంది .


 ఇకపోతే హ్యాపీ డేస్ సినిమాలో ముఖ్యమైన పాత్రలో నటించిన నిఖిల్ ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటుడుగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఆ సమయంలో అద్భుతమైన విజయం సాధించిన ఈ మూవీ ని మరికొన్ని రోజుల్లో రీ రిలీజ్ చేయబోతున్నారు.

అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా చాలా రోజుల క్రితమే వెలువడింది. ఈ మూవీ ని ఏప్రిల్ 19 వ తేదీన థియేటర్ లలో చేయబోతున్నట్లు ఈ మూవీ మేకర్స్ తాజాగా అధికారికంగా ప్రకటించారు. అలాగే ఈ సినిమా యొక్క ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రీ రిలీజ్ హక్కులను "గ్లోబల్ సినిమాస్" సంస్థ దక్కించుకున్నట్లు ఈ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మరి రీ రిలీజ్ లో భాగంగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ ఇంపాక్ట్ ను చూపిస్తుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: