నగ్నంగా నటించేందుకు.. స్టార్ హీరో 3 రోజులు ఉపవాసం చేశాడట?

praveen
ఒకప్పుడు స్టార్ హీరోలు కేవలం కమర్షియల్ సినిమాలు మాత్రమే చేసేవారు. నాలుగు ఫైట్లు నాలుగు పాటలు రెండు రొమాంటిక్ సన్నివేశాలు ఉండే విధంగా సినిమా కథలను ప్లాన్ చేసుకునేవారు. కానీ ఇప్పుడు అందరి ఆలోచన తీరు పూర్తిగా మారిపోయింది. ప్రేక్షకులు సైతం కొత్త కథలను ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. ఎంతటి స్టార్ హీరో అయినా సరే రొటీన్ రొడ్డ కొట్టుడు కథలతో వస్తుంటే.. అస్సలు యాక్సెప్ట్ చేయడం లేదు. దీంతో అప్పటికే మంచి గుర్తింపును సంపాదించి.. కోట్ల మంది అభిమానులు ఉన్న హీరోలు సైతం.. ఇక ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.


 ఈ క్రమంలోనే ఎంతోమంది స్టార్ హీరోలు హీరోయిన్లు పాత్ర డిమాండ్ చేస్తే ఎలాంటి పని చేయడానికి అయినా సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది అని చెప్పాలి. కొంతమంది ఏకంగా పాత్ర కోసం భారీగా బరువు తగ్గిపోవడం చేస్తున్నారు. ఇంకొంతమంది ఏకంగా ఒక్కసారిగా బరువు పెరిగి అభిమానులందరికీ షాక్ ఇస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే కోలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్న పృధ్విరాజ్ సుకుమారన్ సైతం ఇటీవల ఆడుజీవితం సినిమా కోసం చేసిన రిస్క్ గురించి తెలిసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అయ్యారు. ఏకంగా భారీగా బరువు తగ్గిన పృథ్వీరాజ్ సుకుమారన్ బక్క చిక్కిపోయి కనిపించిన లుక్స్ అందర్నీ అవాక్కయ్యేలా చేశాయి.




 అయితే ఈ సినిమాలో నగ్న సన్నివేశంలో కూడా నటించారట పృధ్వీరాజ్ సుకుమారన్. ఈ విషయం గురించి సినిమాటోగ్రాఫర్ సునీల్ ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సునీల్ ఆడు జీవితం సినిమా కోసం పృధ్విరాజ్ సుకుమారన్ ఎంతో కష్టపడ్డారు అంటూ చెప్పుకొచ్చాడు. ఈ సినిమాలో ఒక నగ్న సన్నివేశంలో నటించడానికి ఆయన మూడు రోజుల పాటు కఠిన ఉపవాసం చేశారు. కనీసం మంచినీళ్లు కూడా తాగలేదు. శరీరంలో మిగిలిన నీటి శాతాన్ని బయటకి పంపేందుకు షూటింగ్ కి ముందు 30 ఎంఎల్ వోడ్కా తాగేవారు. బాగా నిరసించి పోవడంతో లొకేషన్ కు ఆయనను కుర్చీలో తీసుకురావాల్సి వచ్చింది అంటూ సినిమాటోగ్రాఫర్ సునీల్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: