టాలీవుడ్ యంగ్ హీరో తో నాలుగేళ్లుగా ప్రేమాయణం నడుపుతున్న శ్రీముఖి..!?

Anilkumar
కెరియర్ పరంగా ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉంది యాంకర్ శ్రీముఖి. ఇక ఈ ముద్దుగుమ్మ కి ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. కేవలం టీవీ షోస్ లలోనే కాకుండా ఆహారం అంటే ఓటిటి ప్లాట్ఫార్మ్స్ పై కూడా యాంకర్ గా వ్యవహరిస్తోంది ఈమె. దాంతోపాటు సినిమాల్లో సైతం పలు కీలక పాత్రలో నటిస్తోంది. దాంతోపాటు చిన్న చిన్న సినిమాల్లో సైతం కనబడుతోంది అయితే పటాస్ షో తో వెలుగులోకి వచ్చిన ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ సీజన్ 3 లో కూడా ఎంట్రీ ఇచ్చింది. స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఫైనల్ వరకు వెళ్ళింది. కాగా శ్రీముఖి టైటిల్ రేసులో నిలిచి తృటిలో టైటిల్ను

కోల్పోయి రన్నర్గా నిలిచింది. కానీ రెమ్యూనరేషన్ మాత్రం భారీగానే వసూలు చేసింది. అయితే బిగ్ బాస్ షో కి వెళ్లి వచ్చిన తర్వాత శ్రీముఖికి ఇండస్ట్రీలో అవకాశాలు ఎక్కువగా వచ్చాయి. తర్వాత ఆమెకి ఆఫర్స్ భారీగా వచ్చాయి. యాంకర్ గా మరింత బిజీ అయింది ఈ బ్యూటీ. ఇకపోతే క్రేజీ అంకుల్ సినిమాలో శ్రీముఖి హీరోయిన్గా నటించిన సంగతి మనందరికీ తెలిసిందే. కానీ ప్రస్తుతం మాత్రం హీరోయిన్ గా కాకుండా శ్రీముఖి ఆచితూచి అడుగులు వేస్తోంది. మరొకవైపు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రీముఖి పెళ్లికి సంబంధించిన వార్తలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి.

ఈ క్రమంలోనే తాజాగా ఒక యంగ్ హీరోతో ఆమె డేటింగ్ చేస్తుంది అన్న వార్తలు సోషల్ మీడియాలో వినబడుతున్నాయి.గత నాలుగేళ్లుగా ఒక వ్యక్తితో శ్రీముఖి రిలేషన్ లో ఉంది అన్న వార్తలు వినబడుతున్నాయి. వీరిద్దరూ రహస్యంగా ప్రేమించుకుంటున్నట్లు గా తెలుస్తోంది. శ్రీముఖి ప్రేమ వ్యవహారం కుటుంబ సభ్యులకు కూడా తెలుసట. ఇరు కుటుంబాల పెద్దలు అంగీకారం తెలిపిన నేపథ్యంలో వివాహానికి ఏర్పాట్లు జరుగుతున్నాయట. ఈ ఏడాది చివర్లో సదరు హీరోతో శ్రీముఖి వివాహం అంటున్నారు. దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. సోషల్ మీడియా వర్గాల్లో చర్చ నడుస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: