
ఆ స్టార్ హీరో మూవీలో.. అతిధి పాత్రలో ధోని?
అయితే ఇప్పుడు ఒక స్టార్ హీరో సినిమాలో క్రేజీ సెలబ్రిటీ అతిథి పాత్రలో కనిపించబోతున్నాడు అన్న వార్త వైరల్ గా మారిపోయింది. క్రేజీ సెలబ్రిటీ అనగానే మరో స్టార్ హీరో అనుకుంటున్నారు కదా. అలా అనుకున్నారు అంటే పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఇలా అతిథి పాత్రలో కనిపించబోయేది స్టార్ హీరో కాదు.. స్టార్ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని. కోలీవుడ్ ఇండస్ట్రీలో దళపతిగా కొనసాగుతున్న స్టార్ హీరో విజయ్ మూవీలో ఇలా ధోని ఒక అతిథి పాత్రలో కనిపించబోతున్నాడు. ప్రస్తుతం విజయ్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం అని టైటిల్ ను ఈ సినిమాకు ఫిక్స్ చేశారు.
అయితే ఈ మూవీపై రోజు రోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇక ఇటీవల ఈ సినిమా గురించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో తెగచక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో భారత మాజీ క్రికెటర్ మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోని కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ మూవీలో క్రికెట్కు సంబంధించిన సన్నివేశాలు ఎంతో కీలకంగా ఉంటాయని.. అయితే అలాంటి సన్నివేశాలలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని కనిపిస్తారని ఒక వార్త ప్రస్తుతం ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.