బాలయ్య కోసం ఆ హిట్ సెంటిమెంటే ను ఫాలో అవుతున్న దర్శకుడు బాబి..!?

Anilkumar
నటసింహం నందమూరి బాలకృష్ణ సినిమాల పరంగా ప్రస్తుతం ఫుల్ జోష్లో ఉన్నాడు. అఖండ సినిమాతో ప్రారంభమైన ఈ ప్రభంజనం వీరసింహారెడ్డి భగవంత్ కేసరి సినిమాలతో ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. దాదాపుగా 30 సంవత్సరాల తర్వాత నటసింహం నందమూరి బాలకృష్ణ  వరుసగా బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంటున్నాడు. ఈ క్రమంలోనే డైరెక్టర్ బావి దర్శకత్వంలో ఇప్పుడు తన నెక్స్ట్ సినిమా చేస్తున్నాడు. కాగా ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదల కాబోతోంది.  సితార ఎంటర్టైన్మెంట్స్ వారి బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు నటసింహం నందమూరి బాలకృష్ణ  నూతన సినిమాలో 

నెక్స్ట్ లెవెల్లో సరికొత్తగా చూపించడానికి బాబి సిద్ధమవుతున్నట్లు గా తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో బాలయ్య డౌన్ పాత్రలో కనిపించబోతాడట. అయితే మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఈ సినిమా నుండి విడుదల చేసిన గ్లిమ్స్ మంచి రెస్పాన్స్ ను అందుకున్నాయి. ఈ క్రమంలోనే ఈ సినిమాలో నటసింహ నందమూరి బాలకృష్ణ రెండు విభిన్న పాత్రలో కనిపించనున్నాడు అని అంటున్నారు. రీసెంట్‌గా నటసింహం నందమూరి బాలకృష్ణ  డ్యూయల్ రోల్లో యాక్ట్ చేసిన 'అఖండ', వీరసింహారెడ్డి, అంతకు ముందు.. లెజెండ్, సింహా నటసింహం నందమూరి బాలకృష్ణ రెండు విభిన్నపాత్రల్లో నటించిన చిత్రాలు 

బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి. ఇపుడు అదే కోవలో బాబీ.. ఈ సినిమాలో నటసింహం నందమూరి బాలకృష్ణ రెండు పాత్రలను డిఫరెంట్‌గా వెండితెరపై ఆవిష్కరించబోతున్నడట. ఇక ఈ సినిమా పేరున తెలుగు నూతన సంవత్సాది ఉగాది కానుకగా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ కూలెస్ట్ మరియు క్రూయలెస్ట్ గా కనిపించనున్నారు. అలా ఇప్పుడు బాబీ ఈ సినిమా కోసం నటసింహం నందమూరి బాలకృష్ణ ని రెండు పాత్రల్లో చూపించబోతున్నాడు మరి ఈ సినిమా ఎటువంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: