ఆ సీనియర్ హీరో అంటే చాలా ఇష్టం... కస్తూరి..!

Pulgam Srinivas
చాలా సంవత్సరాల క్రితం ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న నటి కస్తూరి గురించి ప్రత్యేకం గా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపును ... మంచి స్థానాన్ని ఇండస్ట్రీ లో సంపాదించుకున్న ఈ నటి ఈ మధ్య కాలంలో సినిమాల కంటే కూడా ఎక్కువగా సీరియల్స్ లో నటిస్తూ వస్తుంది . ఈ నటికి సీరియల్స్ ద్వారా అద్భుతమైన గుర్తింపు లభించింది.

అలాగే ఈమె సీరియల్ లలో తన పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ప్రస్తుతం ఈమెకు ఎంతో మంది బుల్లి తెర అభిమానులు ఉన్నారు. సీరియల్ లతో మాత్రమే కాకుండా ఈ మధ్య కాలంలో ఈమె కొన్ని సినిమాలలో కూడా నటించింది. అలాగే పలు వెబ్ సిరీస్ లలో కూడా నటించింది. వీటి ద్వారా కూడా ఈమె మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇకపోతే తాజాగా కస్తూరి ఓ ఇంటర్వ్యూ లో పాల్గొంది.

ఆ ఇంటర్వ్యూ లో భాగంగా ఓ సీనియర్ హీరో అంటే తనకు చాలా ఇష్టం అని వెల్లడించింది. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా కస్తూరి మాట్లాడుతూ ... నాకు చదువుకునే రోజుల నుండి నాగార్జున అంటే చాలా ఇష్టం. ఆ రోజుల్లో నేను అక్కినేని హీరోను కలిశాను. షేక్ అండ్ కూడా ఇచ్చాను. నాగార్జున టచ్ చేసిన చెయ్యి అంటూ అంతా ఆ చేయని తాకేవారు అని చెప్పింది. అలాగే ఇప్పటికి కూడా ఆయన అంటే ఇష్టం అని చెప్పుకొచ్చింది. ఇకపోతే నాగార్జున హీరో గా దర్శకేంద్రుడు కే రాఘవేందర్రావు దర్శకత్వంలో రూపొందిన అన్నమయ్య సినిమాలో కస్తూరి , నాగార్జున కు జోడీ గా నటించింది. ఈ మూవీ లో కస్తూరి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: