రాజా సాబ్ లో ఊహించని ట్విస్ట్ !

Seetha Sailaja
ప్రభాస్ మారుతి దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్నాడు అనగానే ప్రభాస్ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు అంటూ అతడి అభిమానులు గగ్గోలు పెట్టడం మొదలుపెట్టారు. దీనికితోడు ఈమూవీ ఒక హారర్ కామెడీ జోనర్ అని వార్తలు రాగానే అతడి అభిమానుల అసహనం మరింత పెరిగిన విషయం తెలిసిందే.

మారుతి ప్రభాస్ తో హారర్ కామెడీ చేస్తున్నాడు అనగానే గతంలో మారుతి తీసిన ‘ప్రేమకథా చిత్రం’ సినిమా తరహాలో ప్రభాస్ మారుతిల కాంబినేషన్ లో వస్తున్న ‘రాజాసాబ్’ ఉంటుంది అన్న అంచనాలు మొదలయ్యాయి. అయితే మీడియాలో వస్తున్న వార్తల పై ఈమూవీ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈమూవీకి సంబంధించి కొన్ని షాకింగ్ విషయాలు తెలియచేశాడు.

ఈమూవీలో గ్రాఫిక్స్ ఊహాకాందని స్థాయిలో ఉంటాయని కేవలం గ్రాఫిక్స్ కోసమే ఈమూవీ బడ్జెట్ విపరీతంగా పెరిగింది అన్న విషయాన్ని వెల్లడిస్తూ ఈమూవీ గ్రాఫిక్ వర్క్స్ ను ఒక అంతర్జాతీయ కంపెనీ నేతృత్వంలో పనులు జరుగుతున్న విషయాన్ని వివరించాడు. ఈమూవీలో ప్రేక్షకుల ఊహలకు అందని ట్విస్ట్ లు అనేకం ఉంటాయి అంటూ ఈమూవీ పై అంచనాలు మరింత పెంచాడు.

ఇక ఈమూవీ రిలీజ్ డేట్ గురించి వస్తున్న వార్తల పై స్పందిస్తూ ప్రస్తుతం ప్రభాస్ ఫోకస్ అంతా నాగ్ అశ్విన్ తీస్తున్న ‘కల్కి’ పై ఉందనీ ఈమూవీ విడుదల తరువాత మాత్రమే ప్రభాస్ ‘రాజాసాబ్’ మూవీ గురించి ఆలోచనలు చేస్తాడని ఈలోపుగా ప్రభాస్ పాత్రతో సంబంధం లేకుండా ఉండే కొన్ని కాంబినేషన్ సీన్స్ షూటింగ్ జరుగుతోంది అన్న విషయాన్ని ఈమూవీ నిర్మాత లీకులు ఇస్తున్నాడు. అన్నీ అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే ఈమూవీ డిసెంబర్ రెండవ వారంలో విడుదల అయ్యే అవకాశం ఉంది అంటూ కొందరు అభిప్రాయ పడుతున్నారు. అదే జరిగితే ఈ సంవత్సరం ప్రభాస్ నుండి రెండు సినిమాలు విడుదల అవుతాయి. దీనితో ఒకే సంవత్సరాం ప్రభాస్ నుండి రెండు సినిమాలు వస్తున్నాయి అనుకోవాలి..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: