ఇష్టం లేకపోయినా.. సినిమాలో ఆ డైలాగులు చెప్పాను : పవన్ కళ్యాణ్

praveen
తెలుగు చిత్ర పరిశ్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సి పనిలేదు. అందరికీ హీరోలతో పోల్చి చూస్తే పవన్ కళ్యాణ్ చేసింది కొన్ని సినిమాలే.  అందులో హిట్ అయినవి కూడా కొన్ని మాత్రమే. అయినప్పటికీ మిగతా హీరోలతో పోల్చి చూస్తే పవన్ కళ్యాణ్ కు కాస్త ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంటుంది. ఆయన సినిమాలను చూసి కాదు ఆయన వ్యక్తిత్వాన్ని చూసి అభిమానులుగా మారిన వారే ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు అని చెప్పాలి. అందుకే హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా పవర్ స్టార్ గా కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్ అంతకంతకు పెరుగుతూనే ఉంటుంది. అయితే ప్రస్తుతం ఒకవైపు జనసేన పార్టీని స్థాపించి రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్.. మరోవైపు వరుసగా సినిమా షూటింగ్లలో కూడా పాల్గొంటున్నారు అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే ఎప్పుడో ఒకసారి మాత్రమే ప్రేక్షకుల ముందుకు వస్తున్న పవన్ సినిమాలు.. ఈ మధ్యకాలంలో సూపర్ హిట్ అవుతూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో రాజకీయాల కారణంగా వరుసగా సినిమాలు చేయలేకపోతున్నాడు పవన్. ఇదిలా ఉంటే గతంలో గబ్బర్ సింగ్ తో పవన్ కళ్యాణ్ కు సూపర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ హరీష్ శంకర్ డైరెక్షన్లో ప్రస్తుతం  పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాలో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇటీవల టీజర్ ని చిత్ర బృందం విడుదల చేశారు అని చెప్పాలి. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ చెప్పే డైలాగులు ఆకట్టుకున్నాయ్. మరీ ముఖ్యంగా గాజు గ్లాస్ గురించి ఉండే ఒక డైలాగ్ ఈ టీజర్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా మారిపోయింది అని చెప్పాలి.

 పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాస్ అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ఈ గాజు గ్లాస్ గురించి చెప్పే డైలాగులు అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. అయితే ఇలా టీజర్ లో వచ్చే గాజు గ్లాస్ డైలాగ్ గురించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారిపోయాయి. సినిమాలలో ఇలాంటి డైలాగులు చెప్పడం నాకు ఇష్టం ఉండదు. కానీ డైరెక్టర్ హరీష్ శంకర్ బాధ భరించలేక బలవంతంగా ఇష్టం లేకపోయినా ఈ డైలాగులు చెప్పాల్సి వచ్చింది అంటూ పవన్ కళ్యాణ్ తెలిపాడు. ఇంతకీ ఆ డైలాగ్ ఏంటంటే.. గాజు పగిలే కొద్ది పదును పెరుగుతుంది.. గాజు అంటే సైన్యం అంటూ పవన్ కళ్యాణ్ టీజర్ లో డైలాగులు చెప్తాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: