టీజర్: నెక్స్ట్ లెవెల్ లో సూర్య కంగువ టీజర్..!!

Divya
కోలీవుడ్ హీరో సూర్య తమిళ డైరెక్టర్ శివా తో కలసి తెరకెక్కిస్తున్న చిత్రం కంగువ.. ఈ సినిమా ఫాంటసీ యాక్షన్ త్రిల్లర్ చిత్రంగా తెరకెక్కిస్తూ ఉన్నారు.. స్టూడియో గ్రీన్ బ్యానర్ పైన యూవి క్రియేషన్ బ్యానర్ పైన భారీ బడ్జెట్ తో దాదాపుగా 38 భాషలలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఆల్రెడీ ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ తో పోస్టర్స్ తోనే భారీ అంచనాలను క్రియేట్ చేశారు. ఇప్పుడు ఆ అంచనాలను మరొకసారి పెంచేస్తూ ఈ చిత్రం నుంచి టీజర్ ని రిలీజ్ చేశారు.

టీజర్ ని డైలాగులు లేకుండా నింపేయడమే కాకుండా విజువల్స్ తో మాత్రం హైలెట్ చేస్తున్నారు. ముఖ్యంగా అడవి భయంకరమైన ఆదివాసులు ఖడ్గముగాలు సముద్రంలోని కొన్ని సన్నివేశాలు సరికొత్త ప్రపంచాన్ని చూపించేలా కనిపిస్తున్నారు. ఒక పీరియాడికల్ సబ్జెక్టుని శివ లాంటి కమర్షియల్ డైరెక్టర్ ఈ రేంజ్ లో చూపించడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.. మొత్తంగా కంగువ సినిమా టీజర్ అయితే ఆడియన్స్ తో వావ్ అనిపించుకునేలా చేస్తోంది. కాగా ఈ సినిమా నుంచి సూర్యకు సంబంధించి ఒక వైల్డ్ లుక్ ని స్టైలిష్ మోడరన్ లుక్ లో కూడా విడుదల చేశారు.

దీన్నిబట్టి చూస్తే ఈ చిత్రం కథ మూడు టైం పీరియడ్స్ తో ఉండబోతున్నట్లుగా కనిపిస్తోంది.. భూత భవిష్యత్తు వర్తమాన కాలాలతో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు చూపించే విధంగా ప్లాన్ చేస్తున్నారు. మరి మిగిలిన ఆ మూడు కాలాల పాత్రలకు సంబంధించి ఇలాంటి అప్డేట్ వస్తుందో చూడాలి.. ఈ సినిమా త్రీడీలో మొత్తం 38 భాషలలో విడుదల చేసే విధంగా చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. ఈ సినిమా కోసం పాటు సూర్య అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతాన్ని దేవిశ్రీప్రసాద్ అందిస్తూ ఉన్నారు. ప్రస్తుతం కంగువ సినిమా టీజర్ వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: