మరో రెండు రోజుల్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. జగన్ హాజరవుతారా..??

Suma Kallamadi
2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి 164 సీట్లు కైవసం చేసుకుని అఖండ విజయం సాధించింది. జనసేన 100% సక్సెస్ రేట్ సాధించింది. లోకేష్ భారీ మెజారిటీతో గెలిచి రికార్డు సృష్టించారు. మరోవైపు ఈ ఎన్నికల్లో వైసీపీ అవమానకర ఓటమిని చవిచూసింది. జగన్ 151 అసెంబ్లీ సీట్ల నుంచి 11 సీట్లకు పతనమయ్యారు. ఏపీలో వైసీపీ పట్ల ఇంత వ్యతిరేకత ఉందని ఎవరూ ఊహించలేదు. ఈ క్రమంలో రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. జూన్ 12న బాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత చాలా పథకాలపై సంతకం చేశారు. పెన్షన్లను పెంచారు మెగా డీఎస్సీ పై సంతకం కూడా పెట్టారు.
ఈసారి చంద్రబాబు ప్రభుత్వం చక చకా పనులు చేసుకుంటూ  వెళ్ళిపోతోంది. అవినీతి ఆరోపణలపై వైసీపీ నేతలపై కూడా కేసులు నమోదు చేసుకున్నారు. ఇప్పటికే కొడాలి నాని, రోజా, అనిల్ కుమార్ యాదవ్ లాంటి నేతలు టీడీపీ టార్గెట్ లిస్టులో చేరిపోయారు.
ఇదిలా ఉండగా మరో రెండు రోజుల్లో అంటే 19వ తేదీన ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదలుకానున్నాయి. ఇదే రోజున ప్రొటెం స్పీకర్ ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించడం జరుగుతుంది. 2019లో 151 సీట్లతో చారిత్రాత్మక విజయాన్ని సాధించిన వైసీపీ ఈ సారి 11 సీట్లకే సరిపెట్టుకోవడంతో ప్రతిపక్ష హోదాను సైతం కోల్పోయింది. కనీసం 18 సీట్లు గెలుచుకుంటేనే ప్రతిపక్ష హోదా. ఇప్పుడు జగన్ కు అసెంబ్లీలో పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వరు. చాలా చిన్న ప్లేస్‌ను వైసీపీ నేతలకు కేటాయిస్తారు. వీళ్లు ఈసారి 164 మంది టీడీపీ కూటమి నేతలను ఫేస్ చేయాల్సి ఉంటుంది.
 అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ఇంకా రెండు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ అసెంబ్లీకి వెళ్తారా? లేదా? అనే ప్రశ్న చర్చనీయాంశంగా మారింది. వైఎస్ జగన్ రారు అని టాక్ నడుస్తోంది. ఒకవేళ వస్తే మాత్రం అది సంచలనం అవుతుంది. రాకపోతే సమావేశాల అనంతరం స్పీకర్ ఛాంబర్‌లో జగన్ ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: