అయ్యో అర్జునా! గురూజీకి కూడా హ్యాండిచ్చేశావా?

Purushottham Vinay
పుష్ప 2 సినిమా తర్వాత అల్లు అర్జున్ చేయబోయే సినిమా గురించి నిన్న మొన్నటిదాకా ఒక రేంజ్ లో వార్తలు వచ్చాయి. అసలైతే త్రివిక్రమ్ తో అల్లు అర్జున్ తన తరువాత సినిమా అని అనౌన్స్ చేశారు.ఐతే సడెన్ గా తెర మీదకు తమిళ స్టార్ దర్శకుడు అట్లీ వచ్చాడు. షారుఖ్ ఖాన్ తో జవాన్ తీసి హిట్ అందుకోవడంతో అల్లు అర్జున్ దృష్టిలో పడ్డ అట్లీ మంచి కథతో వస్తే  అతనితో కూడా సినిమా చేద్దామని ఆఫర్ ఇచ్చాడు. అట్లీ అల్లు అర్జున్ స్టోరీ దాదాపు ఓకే కాగా రెమ్యునరేషన్ బడ్జెట్ లెక్కల వల్ల ఈ సినిమా ఆగిపోయిందని సమాచారం తెలుస్తుంది.ఈ సినిమాకు అట్లీ హీరోకి ఈక్వల్ గా ఇంకా చెప్పాలంటే హీరోని మించి రెమ్యునరేషన్ అడగడం వల్ల సినిమా ఆగిపోయిందని అంటున్నారు. ఐతే ఈ వార్తలపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ అయితే ఇంకా రాలేదు.


 సరే అట్లీ పోతే పొయ్యాడు కానీ అల్లు అర్జున్ ని స్టార్ హీరో చేసిన త్రివిక్రమ్ ఉన్నాడుగా అనుకుంటే ఇప్పుడు త్రివిక్రమ్ కూడా అల్లు అర్జున్ తో సినిమా తీసే పరిస్థితి కనిపించట్లేదని సమాచారం తెలుస్తుంది. దానికి కారణం గుంటూరు కారం సినిమా. ఈ సినిమాకి మహేష్ బాబు స్టామినా వల్ల 250 కోట్ల దాకా వసూళ్లు బాగానే వచ్చినా త్రివిక్రమ్ పెన్ పవర్, డైరెక్షన్ మీద మాత్రం విపరీతమైన విమర్శలు వచ్చాయి. కేవలం మహేష్ వల్లనే ఈ సినిమా హిట్ అయ్యిందని త్రివిక్రమ్ కి కూడా తెలుసు. దాంతో బన్నీ కూడా త్రివిక్రమ్ కి హ్యాండ్ ఇచ్చేశాడు. అందుకే ఇక త్రివిక్రమ్ ఈసారి సినిమా అంటూ తీస్తే తను పూర్తిస్థాయిలో కం బ్యాక్ ఇచ్చేలా చేయాలని అనుకుంటున్నాడు.దానికోసం కొంచెం టైం అవసరమని గుర్తించిన త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమాకు మరో ఏడాది పాటు గ్యాప్ తీసుకోవాలని అనుకున్నాడట. అందుకే పుష్ప 2 సినిమా తర్వాత అల్లు అర్జున్ తో సినిమా తీసే ఛాన్స్ లేదని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: