వరలక్ష్మి శరత్ కుమార్ కి కాబోయే భర్త నెల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!?

Anilkumar
నటి వరలక్ష్మి శరత్ కుమార్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కోలీవుడ్ నటుడు శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి శరత్ కుమార్. ఇక హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈమె పలు సినిమాల్లో నటించి భారీగా క్రేజ్ సంపాదించుకుంది. అలా పలు సినిమాల్లో హీరోయిన్గా నటించిన ఈమె హీరోయిన్గా కంటే విలన్ పాత్రలకే బాగా సెట్ అవుతుంది అని ప్రస్తుతం ఈమెకి తెలుగులో వరుసగా విలన్ పాత్రలో నటించే అవకాశాలు వస్తున్నాయి. అలా తనలో ఉన్న నెగిటివ్ షెడ్స్ బయట పెడుతూ వరుస సినిమాల్లో నటించే అవకాశాలను

 దక్కించుకుంటుంది. అయితే ఈమె ఎక్కువగా నెగటివ్ రోల్స్ చేసి భారీగా గుర్తింపు సంపాదించుకుంది. క్రాక్ నాంది వీర సింహారెడ్డి వంటి సినిమాల్లో విలన్ పాత్రలో నటించి బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంది.  తాజాగా ఈమె ఎంగేజ్మెంట్ చేసుకుంది  త్వరలోనే పెళ్లికూతురు కాబోతోంది  మార్చి 2న నిశ్చితార్థం చేసుకున్న ఈమె తన ప్రియుడితో జులైలో పెళ్లి పీటలు ఎక్కుబోతోంది  ఇప్పటికే పెళ్లికి సంబంధించిన అన్ని పనులను పూర్తి చేస్తోంది. అందులో భాగంగానే పెళ్లి పత్రికలను కూడా స్వయంగా చాలామంది సినీ సెలబ్రిటీలకు అందజేస్తుంది

 .అంతేకాదు చాలా సింపుల్ గా కొద్దిమంది కుటుంబ సభ్యుల సమక్షంలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు గా తెలుస్తోంది. అయితే ఆమె పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తి పేరు నికోలై సచ్ దేవ్. అయితే ఈయనకి ఇదివరకే పెళ్లయింది ఒక బిడ్డ కూడా ఉంది. వరలక్ష్మి శరత్ కుమార్ ప్రేమించిన నికోలై సచ్ దేవ్ ఆస్తి విలువ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. నికోలై సచ్ దేవ్ తరతరాల ఆస్తి బాగానే వచ్చిందట. అయితే దానిపై ఆయనకు ఏమాత్రం మోజు లేదట. ఆయన తన సొంతం కష్టం మీదనే నిలబడాలి అనే టైప్ . ముంబైలో సొంత ఆర్ట్ గ్యాలరీ ఉంది. అంతేకాదు పర్సనల్ గా పలువురు స్టార్ సెలబ్రిటీస్ కి ఫోటోగ్రాఫర్ నెలకు సంపాదన లక్షల్లోనే వస్తూ ఉంటుంది. పీక్ టైమ్స్ లో అది కోట్లు కూడా దాటేస్తూ ఉంటుందట .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: