హౌస్ ఆఫ్ ది డ్రాగన్: ఓటీటీలోకి వ‌చ్చేసిన హాలీవుడ్ వెబ్ సిరీస్ ‘హౌస్ ఆఫ్ ది డ్రాగన్’ సీజ‌న్ 2

murali krishna
‘హౌస్ ఆఫ్ ది డ్రాగన్’ సీజన్ 2 స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సీజన్‌లో మొత్తం ఎనిమిది ఎపిసోడ్లు ఉంటాయి, వీటిని వారానికి ఒక ఎపిసోడ్ చొప్పున విడుదల చేస్తారు. ఓటీటీల‌లో హాలీవుడ్ వెబ్ సిరీస్‌లు చూసేవారికి పరిచయం అక్క‌ర్లేని లేని పేరు "గేమ్‌ ఆఫ్ థ్రోన్స్" (Game of Thrones – GOT). 8 సీజన్‌లుగా వ‌చ్చిన ఈ వెబ్ సిరీస్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్టుగా నిలిచింది. ఈ సిరీస్‌కు ప్రీక్వెల్‌గా గాట్ మేక‌ర్స్ "హౌస్ ఆఫ్ ది డ్రాగన్" (House of the Dragon) రూపొందించారు. 2022లో విడుదలైన హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 1 ఓటీటీలో రికార్డు వ్యూస్ సాధించింది. తాజాగా, సీజ‌న్ 2 కూడా విడుదలైంది. ప్ర‌ముఖ ఓటీటీ వేదిక జియో సినిమాలో హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 2 ప్ర‌స్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, బెంగాలీ, మరియు మరాఠీ భాషల్లో అందుబాటులో ఉన్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.
ఇక ఈ సిరీస్ కథ విష‌యానికి వ‌స్తే, కింగ్ విసెరీస్ టార్గారియన్ తన పరిపాలనలో తన కూతురు రెనెరియా టార్గారియన్‌ను రాణిగా ప్రకటిస్తాడు. అతని మరణం తరువాత, విసెరీస్ రెండో భార్య అలిసెంట్ తన కుమారుడు ఏగాన్ టార్గారియన్‌ను (Aegon Targaryen) రాజుగా ప్రకటిస్తుంది. విసెరీస్ కుమార్తె రెనెరియా టార్గారియన్ నిజం తెలుసుకుని, తనను తాను రాణిగా ప్రకటించుకుంటుంది. దీనితో  ఈ రెండు గ్రూపుల మధ్య యుద్ధం జరగనుంది. ఈ సీజన్‌లో ఐరన్ థ్రోన్‌ను ఎవరు దక్కించుకుంటారో చూడాలి.
ఈ సిరీస్‌కు అలాన్ టేలర్ (Alan Taylor) ద‌ర్శ‌క‌త్వం వహిస్తుండగా, మాట్ స్మిత్, ఒలివియా కుక్, ఎమ్మా డి’ఆర్సీ, ఈవ్ బెస్ట్, స్టీవ్ టౌసైంట్, ఫాబియన్ ఫ్రాంకెల్, ఇవాన్ మిచెల్, టామ్ గ్లిన్-కార్నీ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. జూన్ 16 నుంచి ప్ర‌పంచ‌వ్యాప్తంగా మ్యాక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండగా, భారతదేశంలో జియో సినిమా (Jio Cinema) వేదిక‌గా జూన్ 17 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: