రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాలో పాటల కోసం అన్ని కోట్లు ఖర్చు చేశారా..!?

Anilkumar
త్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇక ఈ సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ సినిమా గేమ్ చేంజర్. ఇక ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సౌత్ ఇండియాలోని గొప్ప దర్శకుల్లో ఒకరైన శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమా లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొత్త పాత్రలో కనిపించబోతున్నాడు. రోబో శివాజీ వంటి ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలను ఖాతాలో వేసుకున్న డైరెక్టర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అదేంటంటే రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమా కోసం దర్శకుడు శంకర్ కేవలం పాటల కోసమే 60 కోట్లకు పైగా ఖర్చు చేశాడు అన్న వార్తలు వినబడుతున్నాయి. దాంతో ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. శంకర్ ల్లో పాటలు, ఫైట్‌ల విషయంలో పూర్తిగా డిఫరెంట్‌గా రిచ్‌గా షూట్ చేస్తుంటాడు. వెయ్యి-రెండు వేల మంది డ్యాన్సర్లతో షూటింగ్ చేయడం, ఐదు నిమిషాల పాట కోసం భారీ సెట్ వేయడం, కొత్త పాటలో కథ చెప్పడం, కోసం ఖర్చు చేసినంత

 డబ్బు పాటల చిత్రీకరణకు ఖర్చు చేస్తుంటాడు శంకర్. ఇప్పుడు రామ్ చరణ్ నటిస్తున్న 'గేమ్ ఛేంజర్' విషయంలోనూ అదే పంథాను ఫాలో అయినట్లు తెలుస్తోంది. ఈ లోని ఐదు పాటల కోసం శంకర్ ఇప్పటికే 60 కోట్లకు పైగా ఖర్చు చేశాడట. 'గేమ్ ఛేంజర్' చిత్రాన్ని దిల్ రాజు భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు.' షూటింగ్ చాలా బాగా జరుగుతోంది. ఇప్పటి వరకు 75 శాతం షూటింగ్‌ పూర్తి చేశాం. శంకర్ తనదైన శైలిలో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటి వరకు చిత్రీకరించిన ఐదు పాటల కోసం ఒక్కో పాటకు రూ.10 నుంచి 12 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అది ఆయన స్టైల్. చాలా బాగా వస్తోంది. రామ్ చరణ్ కి బాగా సరిపోయే కథను ఎంచుకుని శంకర్ చేస్తున్నాడు' అని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: