నారా భువనేశ్వరి: గడపే దాటని రాణెమ్మ.. భర్తను గెలిపిస్తుందా..?

Divya
•మహిళా సాధికారతే ధ్యేయం..
•చంద్రబాబు భార్య కాదు మహిళగా ప్రచారం..
•ఈ నారీ శక్తి ప్రయత్నం ఫలిస్తుందా..

(అమరావతి - ఇండియా హెరాల్డ్):
సాధారణంగా రాజకీయాలంటే ఆడవారితో పోల్చుకుంటే మగవారు ఎక్కువగా ప్రజలతో మమేకం అవుతూ అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు.. మరీ ముఖ్యంగా ఎన్నికలు వచ్చాయంటే చాలు ప్రచారాలు చేస్తూ తాము అధికారంలోకి వస్తే ప్రజల కోసం ఏం చేస్తామన్న విషయాన్ని తెలియజేస్తూ.. ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటారు.. అయితే ఇక్కడ ఈసారి మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు రసవత్తరంగా సాగనున్నాయి. కనీ విని ఎరుగని రీతిలో భర్తల కోసం ఎప్పుడూ గడప కూడా దాటని భార్యలు ఇప్పుడు ప్రజలలోకి వస్తూ తమ భర్తను గెలిపించాలంటూ ప్రజలను వేడుకుంటున్నారు.. ఈ క్రమంలోనే అసలు బయట ప్రపంచానికే తెలియని నారా చంద్రబాబు భార్య  నారా భువనేశ్వరి మొదటిసారి తన భర్తను గెలిపించుకోవడం కోసం గడప దాటింది.. తన భర్త అధికారంలోకి వస్తే ప్రజలకు ఎలాంటి మంచి చేకూరుతుంది అనే విషయాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం మొదలుపెట్టడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ఇకపోతే కుప్పం నుంచి చంద్రబాబు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలోనే  కుప్పం ప్రజలలో తన భర్తను మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలని చెబుతూ పలు రకాల ప్రయత్నాలు చేస్తుంది నారా భువనేశ్వరి.. అందులో భాగంగానే నీరు , నిద్ర లేకుండా పూర్తిస్థాయిలో శ్రమిస్తోంది.. తాజాగా కుప్పంలో పర్యటించిన ఈమె వైసిపి ఐదేళ్ల పాలనలో గంజాయి మద్యంతో ఆంధ్ర ప్రదేశ్ పూర్తిగా నాశనమైందని.. మహిళలకు భద్రత లేదని.. నారా భువనేశ్వరి వ్యాఖ్యానించారు. చంద్రబాబు పరిపాలనలోనే రాష్ట్రంలో మహిళలకు రక్షణ దొరుకుతుందని.. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పంలో ఈమె ఎన్నికల ప్రచారం నిర్వహించి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు..
దుర్మార్గ పాలనను గద్దించెందుకు మహిళలంతా బయటకు వచ్చి పోరాడాలని.. ఇలా పోరాడేందుకు మహిళలు భయపడకూడదని కూడా ఆమె ధైర్యం చెప్పారు . ఇక తన భర్త చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు 50 రోజులకు పైగా మహిళలంతా బయటకు వచ్చి పోరాడిన ఫలితంగానే ఆయన జైలు నుంచి విడుదలయ్యారని.. మహిళా అంటే కేవలం వంటింటికి మాత్రమే పరిమితం కాదు అని.. ఆమె ఒక నారీ శక్తి అంటూ గుర్తు చేశారు. ఇక తాను ఇక్కడికి చంద్రబాబు భార్యగా రాలేదని.. ఒక మహిళ గానే వచ్చానని.. మహిళల కోసం పోరాడుతున్నానని మహిళా సాధికారతే తమ కుటుంబ ధ్యేయం అంటూ చెప్పుకొచ్చింది నారా భువనేశ్వరి.. ఇకపోతే అధికారంలోకి రావడానికి తన భర్తను మళ్ళీ గద్దెనెక్కించడానికి నారా భువనేశ్వరి పడుతున్న పాట్లు అంతా ఇంత కాదనే చెప్పాలి.. ముఖ్యంగా ఈమెకు కూడా ప్రజల్లో మంచి స్పందన లభిస్తోంది..  చంద్రబాబు కాకపోయినా ఆయన భార్య నారా భువనేశ్వరి వల్ల అయినా సరే చంద్రబాబు గెలుస్తాడనే ధీమా వ్యక్తం చేస్తున్నారు టిడిపి శ్రేణులు.. ప్రస్తుతం ప్రచారానికి రెండు రోజులు మాత్రమే మిగిలిన ఉన్న నేపథ్యంలో జోరుగా ప్రచారం సాగిస్తున్నారు.. మరి నారా భువనేశ్వరి నారీ శక్తిగా మారి తన భర్త చంద్రబాబు నాయుడుని కుప్పంలో గెలిపిస్తారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: