హిట్ స్టేటస్ కు ఇంకా చాలా దూరంలో ఉన్న "ఆ ఒక్కటి అడక్కు"..!

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటువంటి అల్లరి నరేష్ చాలా సంవత్సరాల తర్వాత ఆ ఒకటి అడక్కు అనే ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ మే 3 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. మొదటి రోజు ఈ సినిమాకు కాస్త నెగటివ్ టాక్ వచ్చినప్పటికీ ఈ మూవీ ఆ తర్వాత బాగానే పుంజుకొని మంచి కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబడుతుంది. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన 4 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. అందులో భాగంగా ఈ సినిమాకు ఎన్ని కలెక్షన్ లు వచ్చాయి. ఈ మూవీ హిట్ స్టేటస్ ను అందుకోవాలి అంటే ఇంకా ఎన్ని కోట్లు రాబట్టవలసి ఉంది అనే వివరాలను తెలుసుకుందాం.
నాలుగు రోజుల బాక్స్ ఆఫీస్ రాని ముగిసే సరికి ఈ సినిమాకు నైజాం ఏరియాలో 85 లక్షల కలెక్షన్ లు దక్కగా ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4 రోజుల్లో ఈ మూవీ కి 1.08 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి నాలుగు రోజుల్లో 1.93 కోట్ల షేర్ ... 4.15 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. నాలుగు రోజుల్లో ఈ మూవీ కి కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్ సీస్ లలో కలుపుకొని 28 లక్షల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా నాలుగు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 2.21 కోట్ల షేర్ ... 4.95 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఈమూవీ దాదాపుగా 4.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. దానితో ఈ సినిమా మరో 2.3 కోట్ల షేర్ కలెక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టినట్లు అయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ ను అందుకుంటుంది. మరి ఈ సినిమా ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: