సెలబ్రెటీ అయితే చాలు.. శవాన్ని పక్కన పెట్టుకుని కూడా ఇంటర్వ్యూలు తీసుకుంటాం?

సినీ పరిశ్రమ అంటేనే ఒక రంగులు ప్రపంచం. ఇక్కడ ఎవరికి వారు స్టార్ డమ్ ను సంపాదించుకొని స్టార్లుగా వెలుగొందాలని చూస్తారు. ప్రయత్నం చేయడంలో తప్పు లేదు. కానీ చాలా మంది ఇబ్బందులను ఎదుర్కొంటూ అవకాశాలను దక్కించుకోలేక నానా యాతన పడుతుంటారు. ఇక మరి కొంత మంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ సాగుతూ ఉంటారు.

ప్రస్తుతం టెలివిజన్ నటుడు అయిన చల్లా చంద్ సూసైడ్ చేసుకొని చనిపోవడం అనేది బుల్లి తెర నటులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన ఇప్పుడు త్రినయని సీరియల్లో  నటించి నటుడిగా మంచి గుర్తింపుని కూడా సంపాదించుకుంటున్నాడు. ఇక ఆయనకు ఇప్పుడిప్పుడే మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. ఈ తరుణంలో ఒక తొందరపాటు నిర్ణయం వల్ల తన లైఫ్ ని కోల్పోవడంతో పాటు.. తనని నమ్ముకున్న వారిన సైతం అనాథలను చేసి వెళ్లిపోవడం అనేది నిజంగా బాధాకరమైన విషయమే.

చంద్రకాంత్ మృతికి ముఖ్య కారణం ఆమె సన్నిహితురాలు.. త్రినయని సీరియల్ నటి పవిత్ర జయరాం కార్ యాక్స్ డెంట్ లో మరణించింది. ఈమెకు..  చందుకు మధ్య వివాహేతర సంబంధం ఉంది. ఈమె మరణాన్ని తట్టుకోలేక అతను బలవన్మరణం చేసుకున్నాడని ఆయన సోషల్ మీడియా పోస్టుల ద్వారా వెల్లడైంది.

భర్త శవం పక్కన ఉండగా.. బాధపడుతున్న అతని భార్య శిల్పను ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూ చేసింది. ఆమె బాధలోనే వాటికి సమాధానం ఇస్తూ ఉంది.  శవాన్ని పక్కన పెట్టుకొని ఇంటర్వ్యూలు ఏంటి అని కొంత మంది కామెంట్ చేశారు. ఇది చూడటానికి ఎబ్బెట్టుగా ఉన్నా ప్రస్తుత పరిస్థితులు అలానే ఉన్నాయి. జనం మంచి కన్నా చెడునే ఎక్కువగా చదువుతున్నారు. పరాయి వారి వ్యక్తిగత విషయాలపై ప్రజలకు ఆసక్తి ఎక్కువగా ఏర్పడటంతో న్యూస్ ఛానళ్లు కూడా టీఆర్పీ కోసం అందుకు అనుగుణంగా తయారైంది. మొత్తంగా చందు మరణం నేర్పుతున్న పాఠం ఏంటంటే.. మనిషి ప్రాణం పోతున్నా జనానికి ఎంటర్ టైన్ మెంట్ కావాలి. మనుషుల్లో మానవత్వం చచ్చిపోతుంది అని చెప్పడానికి తాజా ఉదాహరణే ఈ ఘటన.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: