ఎన్టీఆర్... ప్రశాంతి నీల్ కాంబో మూవీ నుండి పోస్టర్ వచ్చేసింది..!

Pulgam Srinivas
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ , ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో రూపొందెబోయే సినిమాలో నటించడానికి రెడీ గా ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే . వీరి కాంబో మూవీ కి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చి ఇప్పటికే చాలా కాలం అవుతుంది . ఎన్టీఆర్  ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు . మొత్తం రెండు భాగాలు గా విడుదల కానున్న ఈ సినిమా మొదటి భాగం ఈ సంవత్సరం అక్టోబర్ 10 వ తేదీన విడుదల కానుంది .
 

ప్రస్తుతం ఈ సినిమా తో పాటు ఎన్టీఆర్ వార్ 2 మూవీ షూటింగ్ లో కూడా పాల్గొంటున్నాడు. ఈ రెండు మూవీ ల షూటింగ్ లు పూర్తి కాగానే ఎన్టీఆర్ , ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో హీరోగా నటించబోతున్నాడు. ఇక ప్రశాంత్ కొన్ని రోజుల క్రితమే సాలార్ పార్ట్ 1 మూవీ ని పూర్తి చేశాడు. ఇక మరికొన్ని రోజుల్లోనే పార్ట్ 2 సినిమా షూటింగ్ ప్రారంభించబోతున్నాడు. ఎన్టీఆర్ ఆ రెండు సినిమాలను పూర్తి చేసే లోపు ప్రశాంత్ నీల్ కూడా సలార్ పార్ట్ 2 మూవీ ని పూర్తి చేసి ఈ మూవీనిన్ మొదలువ్పెట్టనున్నారు.

ఇకపోతే ఈ రోజు ఎన్టీఆర్ పుట్టిన రోజు కావడంతో ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన ఓ పోస్టర్ ను విడుదల చేస్తూ ఈ సినిమా యొక్క రెగ్యులర్ షూటింగ్ ను ఎప్పుడు మొదలు పెట్టబోతున్నారు అనే విషయాన్ని కూడా తెలియజేశారు. ఎన్టీఆర్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మూవీ యొక్క రెగ్యులర్ షూటింగ్ ను ఆగస్టు నెల నుండి మొదలు పెట్టబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాను మైత్రి సంస్థ వారు నిర్మించబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: