మలయాళం మూవీకి అన్ని కోట్లు తీసుకున్న అనుష్క..!!

Divya
టాలీవుడ్లో లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు పెట్టింది పేరు హీరోయిన్ అనుష్క శెట్టి.. గతంలో వరుసగా సినిమాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యకాలంలో కాస్త బరువు పెరగడంతో తక్కువ సినిమాలలో నటిస్తోంది. చివరిగా ఈమె మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి వంటి సినిమాలో నటించింది. అనుష్క నటించకపోయిన అక్కడక్కడ బయట కనిపించిన కూడా ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈమె క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం మలయాళ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది హీరోయిన్ అనుష్క..

దాదాపుగా రూ .75 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమాలో హీరోగా జయ సూర్య నటిస్తున్నారు.. ఇదంతా ఇలా ఉండగా మలయాళం లో నటిస్తున్న సినిమాకి గాను అనుష్క శెట్టి ఏకంగా 6 కోట్ల రూపాయలు డిమాండ్ చేసినట్లు సమాచారం.. గతంలో ఒక్కో చిత్రానికి మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయలు తీసుకొని అనుష్క.. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా సక్సెస్ తో ఒక్కసారిగా ఆమె రెమ్యూనరేషన్ ని అమాంతం పెంచినట్లు తెలుస్తోంది.

ఏకంగా 14 భాషలలో ఈ సినిమాను విడుదల చేసే విధంగా చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నారు.. గతంలో తమిళ్ తెలుగు కన్నడ చిత్రాలకే పరిమితమైన అనుష్క ఇప్పుడు ఒక అడుగు ముందుకు వేసి మరి మలయాళం ఇండస్ట్రీ వైపుగా అడుగులు వేస్తోంది.. కథానార్.. ది వైల్డ్ సోర్సెరర్ అనే టైటిల్ తో ఈ చిత్రం నీ తెరకెక్కిస్తున్నారు 2024 లోనే ఈ సినిమాని విడుదల చేసే విధంగా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. గతంలో కూడా ఈ చిత్రానికి సంబంధించి గ్లింప్స్ విడుదల చేయగా అదిరిపోయి రెస్పాన్స్ అందుకుంది.. మొదటిసారి మలయాళంలో నటిస్తున్నప్పటికీ అనుష్క ఇంతటి రెమ్యూనరేషన్ తీసుకొని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు అంతేకాకుండా ఇటీవల చాలా స్లిమ్ గా మారిపోయి అందరిని ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: