ఏపీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో నోటా ఓట్లు.. కానీ ఎందుకు..?

Suma Kallamadi
 ఏపీ 2024 అసెంబ్లీ ఎన్నికలు రిజల్ట్స్ చాలామందిని ఆశ్చర్యపరిచాయి. ఆంధ్ర ప్రదేశ్ ఓటర్ల పల్స్ తెలుసుకోవడం ఎవరి తరం కాదు అని రాజకీయ విశ్లేషకులు సైతం అన్నారంటే అతిశయోక్తి కాదు పోయినసారి జగన్‌ను భారీ మెజార్టీతో గెలిపించారు. ఈసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు 100% సక్సెస్ అందించారు. చంద్రబాబును మరోసారి సీఎం చేశారు. విశేషాలే కాకుండా ఇంకొక విశేషం కూడా ఈసారి కనిపించింది అదే నోటాకు పడిన ఓట్లు.
షెడ్యూల్డ్ తెగలకు (ఎస్టీ) రిజర్వ్ చేసిన అరకు లోక్‌సభ నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో నోటా ఓట్లు పడ్డాయి. ఇక్కడే ఆంధ్రప్రదేశ్‌ మొత్తంలో ఇక్కడే అత్యధికంగా నోటా ఓట్లు ఉన్నాయి. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో, అరకు టోటల్ ఇండియాలో రెండవ అత్యధిక నోటా ఓట్లను నమోదు చేసింది, 50,000 మందికి పైగా ప్రజలు ఈ ఎంపికను ఎంచుకున్నారు.
నోటా ఓట్లు పెరగడానికి నిరక్షరాస్యత, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (ఈవీఎం) ప్రక్రియపై అవగాహన లేకపోవడం ప్రధాన కారణాలని నిపుణులు చెబుతున్నారు. ఈ ధోరణికి దోహదపడే ఇతర సామాజిక సమస్యలు కూడా ఉన్నాయి. ఆధునికంగా అభివృద్ధి చెందినప్పటికీ అరకులోని కొన్ని ప్రాంతాలకు ఇప్పటికీ విద్యుత్, కనీస సౌకర్యాలు లేవు. చాలా మంది ఓటర్లు ఎన్నికల రోజున పోలింగ్ బూత్‌లకు చేరుకోవడానికి గంటల తరబడి నడిచి వెళ్లాల్సి వస్తోంది, వారు ఎదుర్కొంటున్న ఈ ఇబ్బందులను ఎత్తిచూపారు కూడా.ఆంధ్రప్రదేశ్‌లోని అసలు అభివృద్ధి చెందని ప్రాంతాలలో ఒకటి అరకు. భారతదేశంలో రెండవ అత్యధిక నోటా ఓట్లు నమోదు అయింది ఇక్కడే, రాష్ట్రంలోని ప్రముఖ రాజకీయ పార్టీల నుంచి స్థానికులు మెరుగైన సేవలను కోరుతున్నారని ఈ రికార్డు చెప్పకనే చెబుతోంది. మరి ఈ సమస్యలకు ఎవరు పరిష్కారం చూపుతారో చూడాలి.
ఆంధ్రప్రదేశ్‌లోని ఇతర లోక్‌సభ నియోజకవర్గాల్లో నోటా ఓట్ల సంఖ్య చూసుకుంటే శ్రీకాకుళం 24,605, విజయనగరం 23,250, ఏలూరు 22,515, అనకాపల్లి 26,235, రాజమండ్రి 24,435. అయితే ఇన్ని నోటా ఓట్ల పడినా సరే వాటి వల్ల ప్రయోజనం ఏమీ ఉండదని చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఈ ఓట్లు లక్షల్లో ఉంటే ఏమైనా కన్‌సిడర్ చేయొచ్చు ఏమో అని తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: