టాక్సిక్: ఆ దేశంలో షూటింగ్.. KGF కంటే తోపట?

Purushottham Vinay
KGF స్టార్ యశ్ హీరోగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రం టాక్సిక్ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇదీ భారీ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న సినిమా.ఈ మూవీలో యశ్ గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించనున్నాడు. కేజీఎఫ్ సినిమా కంటే మరింత శక్తవంతంగా ఆ పాత్ర ఉంటుందని సమాచారం. ప్రస్తుతం ఈ మూవీ తొలి షెడ్యూల్ జరుగుతోంది. యశ్ సహా కీలక నటీనటులంతా కూడా అందులో పాల్గొంటున్నారు.తాజాగా తమిళ హీరోయిన్ నయనతార కూడా సెట్స్ కివెళ్లడానికి రెడీ అవుతోంది. ఇదే షెడ్యూల్ లో యశ్, నయనలపై కీలక సన్నివేశాలు షూట్ చేయనున్నారు. ఇప్పటికే బాలీవుడ్ బ్యూటీ హ్యూమా ఖురేషి కూడా టీమ్ తో జాయిన్ అయింది. నయన్ ఎంట్రీతో షెడ్యూల్ ముగుస్తుందని సమాచారం తెలుస్తుంది. అందువల్ల తదుపరి షెడ్యూల్ కి కూడా యూనిట్ అప్పుడే సన్నాహాలు మొదలు పెట్టింది. అయితే ఇది పూర్తిగా యూకేలో జరిగే షెడ్యూల్ అని సమాచారం తెలుస్తుంది.


ముఖ్య భాగమంతా అక్కడే షూటింగ్ జరుగుతుందని చిత్ర వర్గాల నుంచి తెలుస్తోంది. దాదాపు 150 రోజుల పాటు ఈ షెడ్యూల్ కొనసాగుతుందని తెలుస్తుంది. ఇందులో విదేశీ బృందం కూడా ఎక్కువగా కనిపిస్తుందని చిత్ర వర్గాలు అంటున్నాయి. లాంగ్ షెడ్యూల్ కావడంతో సినిమాకి సంబంధించిన కీలకమైన నటీనటులు ఇంకా టెక్నీషియన్లు మాత్రమే యూకే షెడ్యూల్ లో జాయిన్ అవుతారు. బ్యాక్ డ్రాప్ అక్కడది కావడంతో అక్కడ నటీనటులు ఇంకా సాంకేతిక నిపుణులను వినియోగించుకునేలా మూవీ యూనిట్ ప్రణాళిక సిద్దం చేస్తోందని తెలుస్తుంది.ఇంకా అలాగే ఈ షెడ్యూల్ లో బాలీవుడ్ హాట్ హీరోయిన్ కియారా అద్వాణీ కూడా జాయిన్ అవుతుందని మరో సమాచారం.ఇందులో గ్యాంగ్ స్టర్ పాత్రకి కియారా పెయిర్ గా నటిస్తుందని వినిపిస్తుంది. అయితే నయన్ కూడా ఉండటంతో ఆమె పాత్రపై క్లారిటీ లేదు. దీంతో ఈ సినిమాలో ప్రధానంగా హైలైట్ అయ్యే హీరోయిన్ ఎవరు? అన్నది సందిగ్దంగా మారింది.  ఈ మూవీని ఇంగ్లీష్ సిరీస్ పీకీ బ్లైండర్స్ ప్రేరణతో తెరకెక్కిస్తున్నట్లు ప్రచారంలో ఉంది. అన్ని పనులు పూర్తి చేసి వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఈ మూవీని రిలీజ్ చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: