కల్కి: ఒక్క పాటలో దశవతారాలు చూపేంచేశారుగా! ఇదిరా తెలుగోడి టాలెంట్ అంటే!

Purushottham Vinay
టాలీవుడ్ స్టార్ హీరో పాన్ ఇండియా స్టార్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన తాజా సినిమా కల్కి 2898 ఏడి ఇంకొన్ని గంటల్లో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో హీరోయిన్లుగా బాలీవుడ్ బ్యూటీస్ దీపిక పడుకొనే, దిశా పటాని, మాళవిక నాయర్ నటించారు. సీనియర్ నటులు, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, రాజేంద్ర ప్రసాద్, శోభన, బ్రహ్మానందం కీలక పాత్రలు పోషించారు. అశ్విన్ దత్ నిర్మాతగా 600 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ రేంజ్ లో తెరకెక్కిన ఈ చిత్రానికి ఆయన అల్లుడు యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్, టీజర్స్, ట్రైలర్స్ అన్నీ కూడా ఎంతో ఆకట్టుకున్నాయి. అలాగే పాటలు ఎంతో ఆకట్టుకున్నాయి. యూ ట్యూబ్ లో ట్రెండ్ అవుతున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి కల్కి థీమ్ సాంగ్ విడుదల అయ్యింది. ఈ పాట చాలా ఎమోషనల్ గా ఉంది. కాల భైరవ మరొకసారి తన వాయిస్ తో ఆకట్టుకున్నాడు. 


ఈ పాటలో సత్యయుగం నుంచి కలి యుగం దాకా ఉన్న అన్ని దశవతారాలు చూపించారు. ఈ సినిమాకి తమిళ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్ సంగీతం అందించారు.వైజయంతీ మూవీస్ బ్యానర్ పై సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం.. ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదల కానుంది. రిలీజ్ కు ముందు.. మేకర్స్ వినూత్నంగా ప్రమోషన్స్ చేయడంతో వేరే లెవెల్ లో హైప్ క్రియేట్ అయింది. హాలీవుడ్ రేంజ్ లో మూవీ ఉంటుందని అంతా ఫిక్స్ అయిపోయారు.అయితే కల్కి సినిమా టికెట్ రేట్లు పెంచుకునేందుకు రీసెంట్ గా ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. రోజుకు ఐదు షోలు కూడా వేసుకునేలా ఉత్తర్వులు జారీ చేసింది. అంతకుముందు తెలంగాణ సర్కార్ కూడా అలానే పర్మిషన్ ఇచ్చింది. ఉదయం 5.30 గంటలకు స్పెషల్ వేసుకునేందుకు జీవో జారీ చేసింది. కాగా.. కల్కి సినిమా మిడ్ నైట్ షోస్ పడతాయని అంతా ఫిక్స్ అయ్యారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఉదయం 5.30 గంటలకు ఫస్ట్ షో అనేది పడనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: