రోజంతా యాక్టీవ్ గా ఉండాలంటే ఇవి తినాల్సిందే?

Purushottham Vinay
  పొద్దున్నే బ్రేక్ ఫాస్ట్ సరిగ్గా చేస్తే, రోజంతా కూడా శరీరం ఎంతో యాక్టివ్ గా ఉంటుందని చెబుతారు.అలాగే పని చేస్తున్నప్పుడు కూడా మీరు ఎనర్జిటిక్‌గా ఉంటారు.కానీ మీరు అల్పాహారం మాత్రం సరిగ్గా తీసుకోకపోతే, మీరు రోజంతా బద్ధకం ఇంకా చాలా అలసటతో ఉంటారు. నేటి బిజీ లైఫ్‌స్టైల్‌లో డైట్‌పై సరిగ్గా శ్రద్ధ పెట్టలేకపోతున్నారు. ప్రజలు ఇన్స్టంట్ ఫుడ్ పై ఎక్కువగా ఆధారపడుతున్నారు. అయితే సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్ నమామి అగర్వాల్ మాట్లాడుతూ, చాలా మంది తమ రోజును ఒక కప్పు కాఫీ లేదా టీతో ప్రారంభిస్తారు. కానీ అది రోజు ఆరోగ్యకరమైన ప్రారంభం అని పిలవబడదని అన్నారు. రోజంతా శక్తివంతంగా  ఇంకా శక్తివంతంగా ఉండటానికి, మీకు విటమిన్లు, ఖనిజాలు అలాగే ఫైబర్‌తో సహా అన్ని పోషకాలు అవసరం. యాక్టీవ్ గా ఉండేందుకు మీ రోజును దేనితో ప్రారంభించాలో నిపుణుల నుండి ఇప్పుడు తెలుసుకుందాం.


ఉదయం లేచిన తర్వాత ఉసిరి రసం ఖచ్చితంగా తాగాలి. ఎందుకంటే ఇందులో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది.పైగా దీన్ని తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ కూడా బయటకు వెళ్లి రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. బలమైన రోగనిరోధక శక్తి శరీర వ్యాధులతో పోరాడటానికి బాగా సహాయపడుతుంది. ఇక కలబందను శతాబ్దాలుగా మన ఇళ్లలో ఉపయోగిస్తున్నారు. అందరి ఇళ్లలో కూడా కలబంద మొక్క ఉంటుంది. అయితే దీని జ్యూస్ తాగడం వల్ల శరీరం హైడ్రేట్ గా ఉంటుంది. ఇంకా డైజేషన్ కూడా బాగుంటుంది. విటమిన్ ఎ, ఫైబర్ అలాగే డైజెస్టివ్ ఎంజైమ్‌లు బొప్పాయిలో ఉంటాయి. ప్రతి రోజూ ఉదయాన్నే బొప్పాయి తింటే పేగుల ఆరోగ్యానికి చాలా మంచిది. దీన్ని తింటే పొట్ట కూడా ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది. ఇంకా అలాగే ఉదయం మీరు బాదం, వాల్‌నట్స్ ఇంకా పిస్తా వంటి డ్రై ఫ్రూట్స్ తినాలి. ప్రోటీన్ ఇంకా ఆరోగ్యకరమైన కొవ్వులు డ్రై ఫ్రూట్స్ లో ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి బాగా సరిపోతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: