జగన్ కు షాక్.. రజినీని ఆపేదెవరు.. ఆ పార్టీలోకి జంపా..?

Pandrala Sravanthi
విడదల రజినీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో  ఒక ఊపు ఊపింది.  మంత్రిగా కూడా పనిచేసింది. అలాంటి విడదల రజినీ తాను రాజకీయ ఓనమాలు నేర్చుకున్నదే టిడిపి పార్టీ ద్వారా అని చెప్పవచ్చు. సైబరాబాద్ ఐటీ వనంలో  చంద్రబాబు నాటిన మొక్క నేను అంటూ ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగింది. అవసరాలను బట్టి తన తన యొక్క పాత్రను మార్చుకోవడం  విడదల రజనీకి వెన్నతో పెట్టిన విద్య అని చెప్పవచ్చు.  టిడిపిలో రాజకీయ ఓనమాలుని నేర్చుకొని చివరికి చంద్రబాబు నాయుడి కి హ్యాండ్ ఇచ్చి వైసీపీలో చేరింది. చిలకలూరిపేట ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవిని కూడా పొందింది. అలాంటి విడదల రజిని మంత్రి గానే కాకుండా సోషల్ మీడియాలో కూడా చాలా పేరు సంపాదించుకుంది.

తన రాజకీయ చతురతతో తానంటే ఏంటో నిరూపించుకుంది విడదల రజిని.అయితే ఆమె మంత్రి పదవిని  పేద ప్రజలకు సాయం చేయడంలో ఉపయోగించలేదని చెప్పవచ్చు. తన ఆస్తులు పెంచుకోవడానికి మంత్రి పదవిని అడ్డుగా పెట్టుకొని అనేక ఆస్తులను సంపాదించింది. చివరికి చిలకలూరిపేటలో ఆమె గెలుపు కష్టము అనే స్థాయికి వచ్చింది. దీంతో జగన్మోహన్ రెడ్డి ఆమెను గుంటూరు వెస్ట్ స్థానంలో పోటీ చేయాలని ఆదేశించారు.  అక్కడ కూడా ఎన్నో కుయుక్తులు పన్ని గెలవాలని ట్రై చేసింది. అక్కడి ప్రజలు ఈమె ఆలోచన విధానాన్ని నమ్మలేదు.  చివరికి పంగనామాలు పెట్టి పిడుగురాళ్ల మాధవిని గెలిపించారు.

 రజనీపై మాధవి 49,772 ఓట్ల మెజారిలతో గెలుపు సాధించింది. అలాంటి ఈమె  తన ఆస్తులను కాపాడడానికో లేదంటే ఇక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని అనుకుందో ఏమో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డికి హ్యాండ్ ఇచ్చి మరో పార్టీలోకి వెళ్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కూటమి భాగస్వామ్యులైనటువంటి జనసేన లేదంటే బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు ఆమె సిద్ధమవుతున్నారని పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. మరి చూడాలి రజిని పార్టీ మారుతుందా లేదంటే  ప్రతిపక్ష నాయకురాలిగా జగన్ కు సపోర్టుగా నిలుస్తుందా అనేది ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: