ప్రభాస్ జాతకంలో పెళ్లి యోగం లేదు.. వేణు స్వామి కామెంట్స్ వైరల్..!?

Anilkumar
ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి సోషల్ మీడియాలో చేసే రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినీ సెలబ్రిటీల జాతకాలను బట్టి వారి జీవితాల్లో ఏం జరుగుతుంది అన్న విషయాన్ని ముందుగానే చెప్పేస్తూ ఉంటాడు. అలా సోషల్ మీడియాలో ఎప్పుడు ట్రెండింగ్ లో ఉంటాడు ఈ జ్యోతిష్యుడు. సమంతా నాగచైతన్య విడాకులు తీసుకుంటారు అని ఆయన ముందుగానే చెప్పాడు. కానీ ఆ సమయంలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి  చెప్పిన మాటలను ఎవరూ పట్టించుకోలేదు. ఆ తరువాత నాలుగేళ్ల తర్వాత వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. 

నేను చెప్పాను వాళ్ళు ఇద్దరూ విడాకులు తీసుకుంటారు అని.. ఆ సందర్భంలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి  ఈ విషయంపై స్పందించారు కూడా. ఇక అలా అప్పటినుండి ఆయన చెప్పిన ప్రతి విషయం జరుగుతుందా లేదా అన్న కోణంలో ఆలోచించడం మొదలుపెట్టారు జనాలు. ఒక్క సమంతా నాగచైతన్య విషయంలోనే కాకుండా చాలామంది సినీ సెలబ్రిటీల జీవితాల్లో జరిగే విషయాలను ముందుగానే చెప్పిన ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి   ఆయన చెప్పింది చెప్పినట్టుగానే చాలామందికి జరిగింది. కొన్నిరోజుల క్రితం ప్రభాస్ జాతకం గురించి 

ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి 
 చెప్పిన మాటలు ఇండస్ట్రీని షేక్ చేసాయి. ప్రభాస్ జాతకంలో శని నడుస్తుందని, హిట్లు ఉండవని, ప్రభాస్ పనిపోయిందని చెప్పుకొచ్చాడు.. అంతేకాకుండా పెళ్లి యోగం కూడా లేదు అని చెప్పాడు. ఆ సమయంలోనే సలార్ రిలీజ్ అవ్వడం.. భారీ హిట్ అందుకోవడంతో ఈసారి కూడా వేణుస్వామి తప్పులో కాలేశాడు అనుకున్నారు. అంతేనా ప్రభాస్ కు ఒక్క హిట్ ఉండదు.. పనైపోయింది అన్నావ్ కదరా.. ఇప్పుడు చెప్పు అంటూ ట్రోల్ కూడా చేశారు. అయితే.. అనుకోనివిధంగా కొన్ని ఏరియాల్లో సలార్ విజయాన్ని అందుకోలేదు. దీంతో ప్రస్తుతం ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: