ప్రభాస్ సరసన నాని హీరోయిన్.. డార్లింగ్ కు సెట్ అవుతుందా?

praveen
బాహుబలి పాన్ పని ఇండియా స్టార్ గా మారిపోయి ప్రస్తుతం భారీ బడ్జెట్ సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తున్న ప్రభాస్.. వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే బాహుబలి లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత ప్రభాస్ సరైన విజయాలు మాత్రం సొంతం చేసుకోలేకపోయాడు. ఎన్ని సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన.. ఆ సినిమాలు ఆకట్టుకోలేకపోయాయ్. ఇలాంటి సమయంలోనే వరుస ప్లాపులతో సతమతమవుతున్న ప్రభాస్.. కెరియర్ కి అదిరిపోయే బూస్టప్ ఇచ్చింది సలార్ సినిమా. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన  ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది.

 డార్లింగ్ ప్రభాస్ ని అభిమానులు అందరూ కూడా ఎలాంటి పవర్ఫుల్ పాత్రలో అయితే చూడాలి అనుకున్నారో ఇక ప్రశాంత్ నీల్ అలాంటి పాత్రను ప్రభాస్ కోసం డిజైన్ చేసి అభిమానులు అందరిని కూడా మంత్రముగ్ధులు చేసేసాడు అని చెప్పాలీ. ఇక ఇప్పుడు ప్రభాస్ నటిస్తున్న కల్కి సినిమా కూడా విడుదలకు సిద్ధమవుతుంది. ఇక మరోవైపు మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజా సాబ్  మూవీ కూడా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది అన్న విషయం తెలిసిందే. ఇలా వరుస షూటింగ్ లతో బిజీగా ఉన్న సమయంలోనే మరికొన్ని మూవీస్ ని కూడా లైన్లో పెట్టేస్తున్నాడు ప్రభాస్.

 ఈ క్రమంలోనే ఎప్పుడూ డిఫరెంట్ మూవీస్ తో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే డైరెక్టర్ హను రాఘవపూడి తో కూడా ఒక మూవీ చేయబోతున్నాడు. ఇక ఈ మూవీ పిరియాడికల్ డ్రామా నేపథ్యంలో  ఉండబోతుంది అన్నది తెలుస్తుంది. అయితే ఈ మూవీలో ప్రభాస్ సరసన ఎవరిని హీరోయిన్గా ఎంపిక చేస్తారో అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. సీతారామం సినిమా నుండి తనకు లక్కీ హీరోయిన్గా మారిపోయిన మృణాల్ ఠాగూర్ ని హను రాఘవపూడి ప్రభాస్ సరసన హీరోయిన్గా ఎంపిక చేశారు అనే వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే మృనాల్ ఠాకూర్ ప్రభాస్కు సెట్ అవుతుందా లేదా అనే విషయంపై కూడా చర్చ జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: