అద్భుతం: ఆర్పీ పట్నాయక్ సంపూర్ణ భగవద్గీత?

Chakravarthi Kalyan
నేటి తరంతో పాటు అందరికీ అర్థమయ్యేలా సంపూర్ణ భగవద్గీత తాత్పర్యం చాలా అద్భుతంగా రికార్డ్ చేసిన ఆర్పీ పట్నాయక్ గారి ధన్యవాదాలు. ఇది చాలా గొప్ప కార్యం. శాశ్వతంగా నిలబడిపోతుంది అన్నారు హీరో విశ్వక్ సేన్. ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ రికార్డ్ చేసిన సంపూర్ణ భగవద్గీత తాత్పర్యంలోని విశ్వరూప దర్శనం అధ్యాయం లాంచ్ చేశారు విశ్వక్ సేన్.

ఈ వేడుకలో భాగం కావడం గౌరవంగా వుందని.. . ఇలాంటి వేదికలో పాల్గోవాలంటే రాసి పెట్టి వుండాలని..  భగవద్గీత విశ్వరూప దర్శనం అధ్యాయం లాంచ్ చేయడం నా అదృష్టమని అంటారు హీరో విశ్వక్ సేన్. కేవలం పాడ్ కాస్ట్ లా వినొచ్చేమో అనుకున్నానని.. కానీ విజువల్ కూడా చాలా కేర్ తీసుకొని అద్భుతంగా చేశారన్నారు హీరో విశ్వక్ సేన్. నేటి యువతతో పాటు అందరికీ అర్థమయ్యేలా సంపూర్ణ భగవద్గీత తాత్పర్యంను చాలా చక్కగా రికార్డ్ చేసిన ఆర్పీ పట్నాయక్ గారి ధన్యవాదాలని హీరో విశ్వక్ సేన్ అన్నారు.

ఈ కార్యాన్ని భగవంతుడే నా చేత చేయించాడని సంగీత దర్శకులు ఆర్పీ పట్నాయక్ అంటున్నారు. నేను కేవలం నిమిత్తమాత్రుడినేనని.. స్వామి ముకుందనంద రాసిన భగవద్గీత అందరికీ సులువుగా అర్ధమైయ్యేలా వుంటుందని... వారి అనుమతితోనే రికార్డ్ చేశానని సంగీత దర్శకులు ఆర్పీ పట్నాయక్ అన్నారు. ఈ ప్రయాణంలో ఎంతగానో తోడ్పడిన దివాకర్ గారికి ధన్యవాదాలు తెలిపిన సంగీత దర్శకులు ఆర్పీ పట్నాయక్.. జానకీరామ్ గారు అద్భుతమైన విజువల్స్ చేశారని... ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పని చేశారని గుర్తు చేసుకున్నారు. యూత్ ని ద్రుష్టిలో పెట్టుకొని చేసిన భగవద్గీత ఇదన్న సంగీత దర్శకులు ఆర్పీ పట్నాయక్.. అందుకే ఈ వేడుకకు ఒక యూత్ హీరో అతిధిగా వుండాలని విశ్వక్ ని పిలిచామన్నారు.

భగవద్గీత ఆర్పీ పట్నాయక్ గారు తాత్పర్యంతో రికార్డ్ చేస్తున్నారని తెలిసి చాలా ఆనందంగా అనిపించిందన్న దర్శకుడు దశరథ్.. ఇది చాలా బావుందని.. చిరకాలం నిలిచిపోయే ప్రాజెక్టని అన్నారు. ఈ వేడుకలో జెకె భారవి, రఘు కుంచె, సింగర్ కౌశల్య, జెమిని సురేష్ పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగిందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: