ఆ బాడీ పార్ట్ కి పిల్లర్ వేయించాను.. నిజం చెప్పేసిన పవన్ కళ్యాణ్ నటి?

praveen
అనన్య నాగల్లా.. ఈ పేరు తెలుగు సినీ ప్రేక్షకులకు తెలిసే ఉంటుంది. ప్రియదర్శి హీరోగా వచ్చిన మల్లేశం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. ఇక మొదటి సినిమాతోనే తన అందం అభినయంతో అందరినీ కట్టిపడేసింది. తన నటనతో మంచి మార్కులు కూడా సొంతం చేసుకుంది. ఇక ఆ తర్వాత కూడా చాలానే సినిమాల్లో నటించిన పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే అనన్య నాగళ్ళను తెలుగు ప్రేక్షకులందరికీ బాగా దగ్గర చేసిన సినిమా ఏదైనా ఉంది అంటే అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ మూవీ అని చెప్పాలి. ఇక ఈ సినిమాలో కీలకపాత్రలో నటించి మంచి మార్కులే కొట్టేసింది.

 ఇక ఆ తర్వాత వరుసగా అవకాశాలు కూడా అందుకుంది. అయితే సినిమాల ద్వారా మాత్రమే కాదు సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఎన్నో హాట్ హాట్ ఫొటోస్ ను పోస్ట్ చేస్తూ కుర్రాళ్ళు గుండెల్లో గుబులు పుట్టిస్తూ ఉంటుంది. ఇకపోతే ఇప్పుడు ఈ అమ్మడు నటిస్తున్న సినిమా తంత్ర. మార్చి 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. హారర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ రేంజ్ లోనే అంచనాలు పెట్టుకుంది అనన్య. ఇక ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు అనన్య.

 ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోయిన్స్ గ్లామర్ కాపాడుకోవడానికి సర్జరీ చేయించుకుంటారు. అలా మీరు ఎప్పుడైనా చేయించుకున్నారా అని అడగగా.. అనన్య నిర్మహమాటంగా నిజం చెప్పేస్తుంది. అవును చేయించుకున్నాను. లిప్ షేప్ కోసం నేను లిప్ పిల్లర్ వేయించాను. అది వేసి రెండేళ్లు అవుతుంది. ఇప్పుడు పోయినట్టుంది అంటూ చెప్పుకొచ్చింది. అయితే చాలామంది హీరోయిన్లు ఇలా సర్జరీల గురించి బయటకు చెప్పుకోవడానికి పెద్దగా ఇష్టపడరు. ఎప్పుడు రహస్యంగానే ఉంచుతారు. కానీ అనన్య మాత్రం ఇక మొహమాటం లేకుండా అసలు నిజాన్ని బయట పెట్టేసింది. దీంతో నిజంగా ఆమె గ్రేట్ అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: