సలార్ సినిమాలోని ఆ పాత్ర పై షాకింగ్ కామెంట్స్ చేసిన గోపీచంద్..!?

Anilkumar
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘సలార్’. కేజీఎఫ్ సిరీస్ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ భారీ అంచనాలతో విడుదలై బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.  బాహుబలి సిరీస్ తర్వాత ఆ రేంజ్ సక్సెస్ లేని ప్రభాస్‌కు.. తాజాగా ‘సలార్’ మూవీతో మరోసారి తన విశ్వరూపం చూపించాడు. ఈ సినిమా తొలి రోజు రూ. 178 కోట్ల గ్రాస్ వసూళ్లతో సంచలనం రేపింది. ‘సలార్’ మూవీ ముఖ్యంగా బాహుబలి, బాహుబలి 2, సాహో, ఆదిపురుష్ తర్వాత హిందీలో రూ. 100 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టిన 5వ మూవీగా రికార్డు క్రియేట్ చేసింది. మొత్తంగా హిందీలో ప్రభాస్ క్రేజ్

ఎలా ఉందో ఈ సినిమా వసూళ్లు చెబుతున్నాయి. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న గోపీచంద్ సలార్ మూవీ ఇద్దరు ఫ్రెండ్స్ స్టోరీ అని ఆ సినిమాలో పృథ్వీరాజ్ రోల్ లో నేను యాక్ట్ చేసి ఉంటే బాగుండేదేమో చెప్పలేనని ఆయన తెలిపారు. నాకు, ప్రభాస్ కు మధ్య ఆ బాండింగ్ ఉందని గోపీచంద్ వెల్లడించారు. ప్రభాస్ సినిమాలో ఫ్రెండ్ రోల్ అనేది దర్శకుడు ఛాయిస్ అని గోపీచంద్ వెల్లడించారు. సలార్ లో ఫ్రెండ్ రోల్ లో పృథ్వీరాజ్ బాగా చేశారని గోపీచంద్ పేర్కొన్నారు. ప్రభాస్ తో సినిమా చేయాలంటే కాలం కలిసిరావాలని గోపీచంద్ చెప్పుకొచ్చారు.

ప్రభాస్ తో సినిమా కచ్చితంగా చేస్తానని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభాస్, గోపీచంద్ కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు వస్తుందో చూడాల్సి ఉంది. భీమా సినిమాతో గోపీచంద్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాల్సి ఉంది. ఇక నేషనల్ స్టార్ ప్రభాస్, నటుడు గోపీచంద్ మంచి స్నేహితులు. వీరిద్దరూ వర్షం సినిమాలో నటించినప్పటి నుంచి మంచి స్నేహితులుగా మారారు. చాలా సందర్భాలలో, ఇద్దరు నటులు ఒకరినొకరు ఎంతగా అభిమానించారో వెల్లడించారు. వారు తమ బిజీ షెడ్యూల్‌ల మధ్య కొంత సమయం దొరికినప్పుడల్లా కలిసి నాణ్యమైన సమయాన్ని గడుపుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: