బాలీవుడ్ స్ట్రైట్ మూవీకి రెడీ అవుతున్న ఎన్టీఆర్..!?

Anilkumar
RRR తర్వాత గ్లోబల్ స్టార్‌ అయ్యారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఆయన సినిమాలకు బాలీవుడ్ లో కూడా భారీ డిమాండ్ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్ట్రైట్ సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు ఎన్టీఆర్. మరోవైపు కొరటాల శివ దర్శకత్వంలో దేవర మూవీ చేస్తున్నారు ఎన్టీఆర్. ఎన్టీఆర్ 30 అనే వర్కింగ్ టైటిల్ తో ప్రారంభమైన ఈ సినిమాకు దేవర అనే పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ మేరకు ఎప్పటికప్పుడు వదులుతున్న అప్‌డేట్స్ సినిమాపై ఉన్న ఆసక్తిని రెట్టింపు చేస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఒక్కో అప్‌డేట్ వింటున్న

నందమూరి అభిమానులు పూనకాలెత్తిపోతున్నారు. భారీ యాక్షన్ సీన్స్ తో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఈ సినిమాను రూపొందిస్తున్నారట కొరటాల. ఈ మూవీతో బాలీవుడ్ భామ, శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండటం విశేషం. ఆమె రోల్ ఈ సినిమాలో మేజర్ అట్రాక్షన్ అవుతుందని అంటున్నారు. ఇప్పటికే వదిలిన జాన్వీ లుక్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్ అందుకుంది. అయితే తారక్ బాలీవుడ్ లో స్ట్రైట్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్‌ఆర్ఆర్ తర్వాత గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు.

వరల్డ్ వైడ్ పాపులారిటీతోపాటు దేశవ్యాప్తంగా ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నాడు. ఇక తారక్ నెక్స్ట్ మూవీపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. వారి అంచనాలను రీచ్ అయ్యేవిధంగా ఎన్టీఆర్ తన ప్రాజెక్టును సెట్ చేసుకుంటున్నాడు. ఏ హీరోకైన నార్త్ మార్కెట్లో స్టార్‌మార్క్ పడితే ఇక తిరిగి చూసుకునే అవసరం ఉండదు. అలాగే ప్రభాస్, కేజిఎఫ్ మూవీతో యష్ నార్త్‌లో సత్తా చాటుకుని మార్కెట్ ని పెంచుకున్నారు. నార్త్ ఆడియన్స్ తారక్ మా హీరో అని పిలుచుకునే ప్రయత్నంలో ఎన్టీఆర్ తెగ కష్టపడుతున్నాడు. అందులో భాగంగా ఇప్పటికే హిందీలో వార్ 2 లో నటించేందుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయాన్ ముఖర్జీ డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమా షూటింగ్‌లో త్వరలోనే తారక సందడిచేయనున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: