"ప్రియాంక చోప్రా" ఒక్కో మూవీకి ఎన్ని కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటుందో తెలుసా..?

Pulgam Srinivas
బాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న హీరోయిన్ లలో ప్రియాంక చోప్రా ఒకరు. ఈమె ఇప్పటికే ఎన్నో హిందీ సినిమాలలో నటించి ఇండియా వ్యాప్తంగా సూపర్ క్రేజ్ ను సంపాదించుకోవడం మాత్రమే కాకుండా కొన్ని హాలీవుడ్ సినిమా లలో కూడా నటించి ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇకపోతే ఈ బ్యూటీ కొంత కాలం క్రితం టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందిన జంజీర్ అనే సినిమాలో చరణ్ కు జోడి గా నటించింది.

ఈ మూవీ హిందీ లో జంజీర్ అనే టైటిల్ తోనే విడుదల కాగా ... తెలుగు లో మాత్రం ఈ మూవీ తుఫాన్ అనే టైటిల్ తో విడుదల అయింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేదు. అలాగే ఈ సినిమా ద్వారా ప్రియాంక కు కూడా పెద్దగా గుర్తింపు ఏమీ దక్కలేదు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ చేతిలో మాత్రం అనేక క్రేజీ ప్రాజెక్ట్ లు ఉన్నాయి. ఇకపోతే ఈమెకు ఉన్న క్రేజ్ దృశ్య ఈమె అదిరిపోయే రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం ప్రియాంక చోప్రా ఒక్కో మూవీ కి 15 నుండి 25 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ బ్యూటీ సినిమా యొక్క కథ మొత్తం విన్నాక అందులో తన పాత్ర అద్భుతంగా ఉన్నట్లు అయితే ఆ సినిమాను చాలా తక్కువ రెమ్యూనిరేషన్ తో కూడా చేస్తున్నట్లు సమాచారం.

అలాగే ఈ నటి సినిమా రెమ్యూనరేషన్ ను ఆ మూవీ కథను బట్టి ... ఆ సినిమా దర్శక , నిర్మాతలను బట్టి అలాగే ఆ మూవీ కి కేటాయిస్తున్న రోజులను బట్టి నిర్ణయిస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇకపోతే ఇప్పటికే ఈమె తన అందంతో నటనతో ఎన్నో సినిమాల విజయంలో అత్యంత కీలక పాత్రను పోషించిన సందర్భాలు ఉన్నాయి. ఇలా ఈమె తన నటన తో , అందాల ప్రదర్శనతో ఎన్నో సినిమాల విజయాలలో కీలక పాత్రను పోషించడంతో ఇంతటి క్రేజ్ కలిగిన ఈ బ్యూటీ కి ఈ మాత్రం రెమ్యూనరేషన్ పెద్ద విషయం ఏమీ కాదు అని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Pc

సంబంధిత వార్తలు: