ఏంటి.. వరుణ్ తేజ్ అసలు పేరు ఇది కాదా..!?

Anilkumar
మెగా హీరో వరుణ్ తేజ్ ఇటీవల యంగ్ హీరోయిన్‌ లావణ్య త్రిపాఠిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇక అప్పటి నుంచి వరుస చిత్రాలను ప్రకటిస్తూ ఫుల్ బిజీ అయిపోయాడు. అయితే ఇప్పుడు శక్తి ప్రతాప్ దర్శకత్వంలో ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమాతో వరుణ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇందులో మానుషి చిల్లర్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ మూవీ మార్చి 1న థియేటర్స్‌లో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. దీంతో చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. తాజాగా కొన్ని ఆసక్తికర విషయాలను బయటపెట్టాడు. ముఖ్యంగా తన ఒరిజినల్ నేమ్ ఏంటో చెప్పేశాడు.

ఇన్నాళ్లు అభిమానులు అంతా అనుకున్నట్లు వరుణ్ తేజ్ అనేది తన అసలు పేరు కాదని అన్నారు. తన పూర్తి పేరు 'సాయి వరుణ్ తేజ్'. స్క్రీన్ మీద పెద్దదిగా ఉంటుందని సాయిని తీసేసారట. కానీ పాస్ పోర్టు, స్టడీ సర్టిఫికేట్స్ అన్నింటిలోనూ సాయి వరుణ్ తేజ్ ఉంటుందని చెప్పుకొచ్చారు. అలాగే తన హైట్ 194 సెంటీమీటర్లు..అంటే 6 అడుగుల 4 అంగుళాలు. దీంతో షూటింగ్స్ సమయంలో హీరోయిన్స్ పక్కన నటిస్తున్నప్పుడు హైట్ విషయంలో ఇబ్బంది అవుతుందని.. కాస్త అడ్జస్ట్ అయ్యి నటించాల్సి వస్తుందని తెలిపాడు. ఇక ఇటలీలో వరుణ్ తేజ్,

లావణ్య త్రిపాఠి ప్రేమ బంధంతో ప్రయాణం మొదలుపెట్టి... మొత్తానికి పెద్దల సమక్షంలో పెళ్లి బంధంతో ఒకటయ్యారు. లావణ్య ప్రేమలో పడిపోయిన వరుణ్ తేజ్.. ఆమె బర్త్ డే రోజునే లవ్ ప్రపోజల్ పెట్టాడు. ఇక మొదట లవ్ ప్రపోజ్ చేసింది వరుణ్. ఇక ఆ తర్వాత వరుణ్ ప్రేమను అంగీకరించిన లావణ్య... ఐదుళ్లుగా వీరి ప్రేమను సీక్రెట్ గా ఉంచారు. 2017లో 'మిస్టర్‌' సినిమాతో వరుణ్ తేజ్, లావణ్యల మధ్య పరిచయం ఏర్పడగా... ఆ సినిమా సమయంలో ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారట. ఇక ఆ సినిమా కూడా ఇటలీలోనే షూటింగ్ జరుపుకుంది. ఈ జంటకు ప్రేమ అడుగు ఇటలీలోనే పడిందని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: