సుశాంత్ కేసులో రియా చక్రవర్తికి ఊరట

Anilkumar
బాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య ఇండ్రస్ట్రీ లో ఎంతటి దుమారం రేకెత్తిచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అసలు సుశాంత్‌కు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదని, అది కచ్చితంగా హత్యే అని ఎన్నో రూమర్స్ కూడా సినీ సర్కిల్లో చక్కర్లు కొట్టాయి. నెపోటిజం, డ్రగ్స్.. వీటన్నింటిపై బాలీవుడ్‌లో చాలాకాలం చర్చ సాగింది. నాకు చిన్న వయసులోనే సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడం సినీ ఆడియన్స్ జీర్ణించుకోలేకపోయారు సుశాంత్ మరణించి 4ఏళ్ళు అవుతున్నా ఇప్పటికీ అతన్ని గుర్తుచేసుకుంటున్న ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ 2020 జూన్ 14న

 ముంబైలోని తన నివాసంలో అనుమానస్పద స్థితిలో మరణించాడు అయితే అది ఆత్మహత్య కాదని సుశాంత్ కుటుంబ సభ్యులు రియా చక్రవర్తి తో పాటు ఆమె ఫ్యామిలీ పై కేసు పెట్టారు. సుశాంత్ బ్యాంక్ ఎకౌంట్ నుంచి 15 కోట్లు విత్ డ్రా చేసుకున్నారని సుశాంత్ తండ్రి కేకే సింగ్ ఆరోపించడంతో ఈ కేసులో మనీ లాండరింగ్ జరిగినట్లు భావించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) రియా చక్రవర్తిని ప్రశ్నించింది. ఆ తర్వాత కేసును సీబీఐ కి అప్పగించాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతోపాటు రియా చక్రవర్తి సుశాంత్ కి మాదకద్రవ్యాలు ఇచ్చారనేది మరో ఆరోపణ.

అలా సుశాంత్ మృతి కేసులో పలు ఆరోపణలు ఎదుర్కొని జైలుకు కూడా వెళ్ళింది. ఆమెతోపాటు ఆమె సోదరుడు షోవీక్ చక్రవర్తి కూడా జైలుకు వెళ్లాడు. సీబీఐ రియా చక్రవర్తి ఫ్యామిలీ మెంబర్స్ విదేశాలకు వెళ్లకుండా లుకౌట్ సర్క్యులర్ ని జారీ చేసింది. దాంతో రియా చక్రవర్తి బాంబే హైకోర్టును ఆశ్రయించగా.. తాజాగా కోర్టు లుకౌట్ సర్క్యులర్ ని రద్దు చేస్తూ తీర్పును వెల్లడించింది. దీంతో ఎట్టకేలకు సుశాంత్ సింగ్ రాజ్ ఆత్మహత్య కేసులో రియా చక్రవర్తి తో పాటు కుటుంబ సభ్యులకు భారీ ఊరట లభించడంతో త్వరలోనే రియా చక్రవర్తి విదేశాలకి వెల్లబోతున్నట్లు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: